2.5 లక్షల మందికి ఓటు తిరస్కరణ!
రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం ఆసక్తికర పరిణామమైతే.. వాటిలో భారీగా తిరసరణకు గురికావడం, పెండింగ్లో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రధానంగా యువత ఓటు హకు కోసం పెద్దఎత్తున ముందుకొస్తున్నా.. వారికి ఓటరు జాబితాలో చోటుదకే విషయంలో అధికారుల పరిశీలన ప్రక్రియ కీలకంగా మారింది.
- రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10.92 లక్షల ఫామ్-6 దరఖాస్తులు
- 7.16 లక్షల దరఖాస్తులకు ఆమోదం.. పెండింగ్లో 1.2 లక్షలు
- అర్హులందరికీ ఓటు హకు కల్పనపై సందేహాలు
- దరఖాస్తు తిరస్కరణకు కారణాలు చెప్పాలంటున్న యువత
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం ఆసక్తికర పరిణామమైతే.. వాటిలో భారీగా తిరసరణకు గురికావడం, పెండింగ్లో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రధానంగా యువత ఓటు హకు కోసం పెద్దఎత్తున ముందుకొస్తున్నా.. వారికి ఓటరు జాబితాలో చోటుదకే విషయంలో అధికారుల పరిశీలన ప్రక్రియ కీలకంగా మారింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ -2026)లో భాగంగా ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 2 వరకు ఫామ్-6 ద్వారా 10,92,820 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు 7,16,436 దరఖాస్తులను ఆమోదించారు. 2,55,421 దరఖాస్తులు తిరస్కరించగా 1,20,963 దరఖాస్తులు వివిధ స్థాయిల్లో పెండింగ్ ఉన్నాయి. అంటే దరఖాస్తు చేసుకున్న ప్రతి పది మందిలో దాదాపు నలుగురికి ఇంకా ఓటు హకు ఖరారు కాలేదు.
ఆసక్తి చూపుతున్న యువత
కొత్త ఓటర్ల నమోదుపై యువతలో ఆసక్తి పెరిగిందనడానికి దరఖాస్తుల సంఖ్యే నిదర్శనం. అయితే, ‘సర్’ ప్రక్రియ ప్రారంభానికి ముందు జనవరి 1 నుంచి జూన్ 14 వరకు 5,20,331 ఫామ్-6 దరఖాస్తులు వచ్చాయి. జూన్ 15 నుంచి నవంబర్ 1 వరకు మరో 5,72,489 అందాయి. అంటే రెండో దశలో ఎకువ సంఖ్యలో దరఖాస్తులు నమోదయ్యాయి. అయితే 2.55 లక్షలకుపైగా దరఖాస్తులు తిరసరణకు గురికావడం అసాధారణం. అర్హత లేకపోవడం, పత్రాల్లో లోపాలు, ఒకటికంటే ఎకువ చోట్ల నమోదు వంటి కారణాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. తిరసరణలకు సంబంధించిన కారణాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని యువ ఓటర్లు కోరుతున్నారు.
తిరసరణకు గురైన వారికి కారణాలు తెలియజేయడంతోపాటు నిబంధనల ప్రకారం అప్పీల్ లేదా సవరణకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీ వరకు అందిన ఫామ్-6 దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, అర్హులైనవారిని ఈ నెల 30న ప్రచురించే తుది ఓటరు జాబితాలో చేర్చాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న 1.2 లక్షల దరఖాస్తుల పరిషారంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. తిరసరణకు గురైన దరఖాస్తులను కూడా మరోసారి సమీక్షించి, అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉన్నది.
ఫామ్-6 దరఖాస్తుల వివరాలు
మొత్తం దరఖాస్తులు : 10,92,820
వీటిలో ఆమోదించినవి : 7,16,436
తిరస్కరించినవి : 2,55,421
పెండింగ్లో ఉన్నవి : 1,20,963
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

