హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం పార్ట్ టైమ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ విభాగంలో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆర్ట్స్ కళాశాలలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో దరఖాస్తులను సమర్పించాలని ఓయూ అధికారులు సూచించారు. ఎంఏతో పాటు పీహెచ్డీ చేసి ఉండాలి. నెట్ లేదా స్లెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. అర్హులైన అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయనున్నారు.