ఉద్యోగ నియామకాలపై అక్కసు
రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం ప్రతిపక్షాలు జీర్ణించుకోవడంలేదు.
- వరుస నోటిఫికేషన్లను జీర్ణించుకోలేని ప్రతిపక్షం
- పోలీస్ రిక్రూట్మెంట్పై అసత్య ప్రచారం
- లాంగ్‌జంప్ నిబంధనలపై పనిగట్టుకొని అభ్యర్థులను తప్పుదారి పట్టిస్తున్న వైనం
- ఈవెంట్స్ ఫలితాలతో కుట్రలు పటాపంచలు
హైదరాబాద్ జనవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం ప్రతిపక్షాలు జీర్ణించుకోవడంలేదు. ఉద్యోగ నియామక ప్రక్రియపై కొందరు రాజకీయ నాయకులు పనిగట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా జరిగిన ఫిజికల్ ఈవెంట్స్ (దేహదారుఢ్య పరీక్షలు)పై అభ్యర్థులను తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ పరీక్షలు సజావుగానే నిర్వహిస్తున్నామని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్పీఎల్ఆర్బీ) అధికారులు చెప్తున్నా కొందరు కావాలని నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. దీంతో కొంతమంది నిరసనకు దిగారు. సోషల్‌మీడియాలోనూ పోలీస్ రిక్రూట్మెంట్పై తప్పుడు ప్రచారం చేశారు. కాగా, శుక్రవారం విడుదల చేసిన ఫలితాలు ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలే అని తేల్చేశాయి.
ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలకు మొత్తం 2,07,106 మంది హాజరైతే.. వారిలో ఏకంగా 1,11,209 మంది అర్హత సాధించారు. ఈ సారి ఫిజికల్ ఈవెంట్స్‌కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. ఈ ప్రక్రియ అంతా సీసీ కెమెరాల్లో రికార్డు చేశారు. పూర్తిస్థాయిలో సాంకేతికతను ఉపయోగించి ఫిజికల్ ఈవెంట్లలో పొరపాట్లకు తావులేకుండా పూర్తిచేశారు. లాంగ్ జంప్, షాట్‌ఫుట్‌లో ఒక్కొక్కరికి మూడుసార్లు అవకాశం ఇచ్చారు. తొలిసారిగా ప్రతి అభ్యర్థికి డిజిటల్ ఆర్ఎఫ్ఐడీ రిస్ట్ బ్యాండ్‌ను అందించారు. ఎకడా లోపాలు జరుగకుండా ఎత్తు కొలిచేందుకు కూడా డిజిటల్ యంత్రాలను వినియోగించారు. ప్రిలిమినరీ రాత పరీక్షకు కూడా బయోమెట్రిక్ విధానం అమలు చేశారు.
అబద్ధం: ఈ సారి నిబంధనలు మార్చడంతో పోలీస్ రిక్రూట్మెంట్ ఫిజికల్ ఈవెంట్స్‌లో అతి తకువ మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.
వాస్తవం : ఇది పూర్తిగా అబద్ధం. 2018-19లో జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్లో 48.5% మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్టుల్లో ఉత్తీర్ణులు కాగా.. ప్రస్తుత రిక్రూట్మెంట్లో 53.7% అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. గతంతో పోలిస్తే 5.18 శాతం మంది అభ్యర్థులు పెరిగారు.
అబద్ధం: లాంగ్ జంప్ నిబంధనల్లో మార్పుతో అభ్యర్థులు నష్టపోయారు.
వాస్తవం : లాంగ్ జంప్‌లో ఫిజికల్‌గా అటెండ్ అయిన ప్రతి 100 మంది అభ్యర్థులకు 83 మంది ఉత్తీర్ణత సాధించారు. కేవలం 17 శాతం మంది మాత్రమే క్వాలిఫై కాలేదు.
అబద్ధం : షాట్‌ఫుట్‌లో నిబంధనలు కఠినంగా ఉండటంతో ఎకువమంది క్వాలిఫై కాలేదు.
వాస్తవం : షాట్‌ఫుట్‌లో 91 శాతం మంది పురుషులు, 96 శాతం మంది మహిళలు అర్హత సాధించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

