NOTA | నోటాకు లక్ష ఓట్లు.. అల్యధికంగా మల్కాజిగిరిలో..
పోస్టల్ బ్యాలెట్‌లోనూ నోటాకు ఓట్లు పోల్ అయ్యాయి. ఉద్యోగులు, దివ్యాంగులు, 85 ఏండ్లు పైబడినవారి సౌకర్యార్ధం పోస్టల్ బ్యాలెట్‌ను ఎన్నికల సంఘం కల్పించింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 2.18 లక్షల ఓట్లు పోల్ అయ్యా యి.
- నోటాకూ ఓటేసిన ఉద్యోగులు
NOTA | హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): పోస్టల్ బ్యాలెట్‌లోనూ నోటాకు ఓట్లు పోల్ అయ్యాయి. ఉద్యోగులు, దివ్యాంగులు, 85 ఏండ్లు పైబడినవారి సౌకర్యార్ధం పోస్టల్ బ్యాలెట్‌ను ఎన్నికల సంఘం కల్పించింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 2.18 లక్షల ఓట్లు పోల్ అయ్యా యి. పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్న వర్గాలు కూడా ఏ రాజకీయ పార్టీ అభ్యర్థి కూడా నచ్చలేదని, వారందరినీ తిరస్కరించి నోటాకు ఓటేశారు.
పోస్టల్ బ్యాలెట్లో నోటాకు నల్లగొండ లోక్‌సభ పరిధిలో 217, వరంగల్‌లో 171, మల్కాజిగిరిలో 160, ఖమ్మంలో 125, పెద్దపల్లిలో 120, మహబూబాబాద్‌లో 80 మంది, భువనగిరిలో 75 మంది, సికింద్రాబాద్‌లో 74 మంది, కరీంనగర్లో 65 మంది ఓటేశారు. ఉద్యోగులతోపాటు సా ధారణ ఓటర్లు నోటాకు 1,02,661 ఓట్లు వేశారు. సాధారణ ఓటర్లలో మల్కాజిగిరిలో 13,206, వరంగల్‌లో 8,209 మంది, ఖమ్మంలో 6,657, పెద్దపల్లిలో 5,591, కరీంనగర్లో 5,373, నాగర్‌కర్నూల్‌లో 4,511, నిజామాబాద్‌లో 4,440, మహబూబ్‌నగర్ 4,286 మంది ఓటు వేశారు.
భువనగిరిలో సీపీఎంకు 28,730 ఓట్లు
సీపీఎం భువనగిరిలో పోటీ చేసింది. అక్కడ సీపీఎం 28,730 ఓట్లు సాధించింది. ఎంఐఎం హైదరాబాద్‌లో పోటీ చేయగా 6,59,278 ఓట్లు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీకి 89,091 ఓట్లు పోల్ అయ్యాయి. ఆల్ ఇండియా ఫ్వారర్డ్ బ్లాక్ పార్టీకి 43,748 ఓట్లు వచ్చాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | పెన్షన్లు ముఖ్యమంత్రి చూస్తడు.. దివ్యాంగుడితో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Rahul gandhi | టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై రాహుల్‌గాంధీ ఫైర్..!
Kriti Sanon | ఏఐ నన్ను భయపెడుతోంది.. సోషల్ మీడియాపై కృతి సనన్ ఆందోళన!
ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

