ఎస్సీ యువత అద్భుతంగా రాణించాలి
సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. ఎస్సీ యువత రిజర్వేషన్ కోటాలోనే కాకుం డా ఓపెన్‌లో కూడా ఉన్నత ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దాలంటూ సూచించారు.
- సివిల్స్, గ్రూప్-1 పోస్టులు సాధించాలి
- ఆ దిశగా అధికారులు కృషి చేయాలి
- మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచన
- ఎస్సీ సంక్షేమం, స్టడీ సరిల్స్ పనితీరుపై సమీక్ష
- గురుకులాలు, హాస్టళ్లకు మహిళా సమాఖ్యల ఉత్పత్తులు సరఫరా చేయాలని సూచన
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. ఎస్సీ యువత రిజర్వేషన్ కోటాలోనే కాకుం డా ఓపెన్‌లో కూడా ఉన్నత ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దాలంటూ సూచించారు.
ఎస్సీ సంక్షేమ శాఖ, స్టడీసరిల్ పనితీరుపై సంబంధిత అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల గురువారం సమీక్షించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణా, స్టడీ సరిల్ డైరెక్టర్ వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చే విధంగా ఆయా అంశాల్లో నిపుణులైన వారి చేత ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని అధికారులకు తెలిపారు. ఓవర్సీస్ సాలర్షిప్స్ను త్వరితగతిన మంజూరు చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో వసతులను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. హాస్టళ్లలో విద్యార్థుల సౌకర్యార్థం డిజిటల్ క్లాస్రూంలు, సౌరశక్తితో నడిచే వాటర్ హీటర్లు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ‘సహజ’ పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తుల గురించి మంత్రి ఈ సందర్భంగా వివరించారు. చౌకగా లభించే నాణ్యమైన ఆ ఉత్పత్తులను గురుకులాలు, హాస్టళ్లకు అందిస్తే బాగుంటుందని, ఈ అంశాన్ని పరిశీలించాలని మంత్రి అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కరువు తెచ్చి.. వరి వద్దంటరా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Anirudh Reddy | 40 కోట్ల బిల్లులిస్తరా.. చావమంటరా?.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం
Power Cuts | వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లకు విద్యుత్ షాక్.. కరెంటు కోతలతో ఒక్కో ట్యాంకర్ డెలివరీకి 3, 4 రోజుల సమయం
Farmers Self Declaration | రైతులకే డిక్లరేషన్ ఎందుకు.. ప్రజావాణిలో నిలదీసిన అన్నదాత
Balmoor Venkat | పొలం దారి ఆక్రమించిన బల్మూరి.. చంపేస్తమని బెదిరింపులు.. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

