కరెంట్ కోతలపై అధికారుల ఆరా
విద్యుత్తు కోతల కారణంగా నీళ్లందక పంటలు ఎండిపోతుండగా.. ట్యాంకర్ల ద్వారా నీరందిస్తూ వాటిని కాపాడుకునేందుకు రైతులు పడుతున్న వెతలపై ఆయా శాఖల అధికారులు స్పందించారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో రైతు నల్లాల శ్యామ్‌సుందర్‌రెడ్డి ఎనిమిది ఎకరాల్లో వేసిన వరి పంట ఎండిపోతుండగా నాలుగు ఆయిల్ ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్న విషయమై గురువారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ సంచికలో ‘ఇది కాంగ్రెస్ సర్కార్ లిఫ్ట్ ఇరిగేషన్' శీర్షికన కథనం ప్రచురితమైంది.
- ‘నమస్తే’ కథనంపై కదిలిన యంత్రాంగం
- ‘నమస్తే’ కథనాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేటీఆర్
- రైతు పొలం వద్దకు అధికారుల పరుగులు
హనుమకొండ సబర్బన్, అక్టోబర్ 22: విద్యుత్తు కోతల కారణంగా నీళ్లందక పంటలు ఎండిపోతుండగా.. ట్యాంకర్ల ద్వారా నీరందిస్తూ వాటిని కాపాడుకునేందుకు రైతులు పడుతున్న వెతలపై ఆయా శాఖల అధికారులు స్పందించారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో రైతు నల్లాల శ్యామ్‌సుందర్‌రెడ్డి ఎనిమిది ఎకరాల్లో వేసిన వరి పంట ఎండిపోతుండగా నాలుగు ఆయిల్ ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్న విషయమై గురువారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ సంచికలో ‘ఇది కాంగ్రెస్ సర్కార్ లిఫ్ట్ ఇరిగేషన్’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
తెలంగాణలో వ్యవసాయ రంగ పరిస్థితి ఇలా ఉన్నదంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టడంతో వేలాది మంది దీన్ని షేర్ చేయడం సంచలనంగా మారింది. ఇది రాష్ట్రస్థాయిలో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. దీంతో రాష్ట్రస్థాయి యంత్రాంగం మొత్తం జిల్లాస్థాయి అధికారులను అప్రమత్తం చేసింది. మండల అధికారులు వేర్వేరుగా రైతు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. ముందుగా విద్యుత్తు శాఖ ఏఈ శిరీష్, సబ్‌ఇంజినీర్, నాయకులు విద్యుత్తు సరఫరా పరిస్థితిని తెలుసుకున్నారు.
విద్యుత్తు సరఫరా ఎలా ఉన్నదంటూ పలువురు రైతులను అడిగి తెలుసుకున్నారు. గతంలో మాదిరిగా కరెంట్ సరఫరా సమయాన్ని పొడిగించాలని పలువురు రైతులు విన్నవించారు. ఇదే కాకుండా సాయంత్రం, రాత్రి వేళల్లోనూ కొంతసమయం కరెంట్ ఇస్తే చివరి దశలో ఉన్న పంట పొలాలకు తడులు అందే అవకాశం ఉంటుందని సూచించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామంటూ అధికారులు హామీ ఇచ్చి వెళ్లిపోయారు. కాగా డిప్యూటీ తహసీల్దార్ రవి, వ్యవసాయాధికారి సాయి, ఇతర అధికారులు సైతం రైతు శ్యామ్‌సుందర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి ఎండిన వరి పొలం పరిస్థితిపై నివేదికను సిద్ధం చేశారు.

Paddy2
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

