Runa Mafi | నేడు చలో ప్రజాభవన్.. రుణమాఫీ కాని రైతుల పిలుపు
రుణమాఫీ అమలుకాని రైతులు పోరుబాట పట్టారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్‌తో గురువారం చలో ప్రజాభవన్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాంకుల ముందు, ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్న రుణమాఫీ కాని రైతులు సోషల్‌మీడియా వేదికగా ఏకమవుతున్నారు.
- మద్దతివ్వాలని కులసంఘాలకు వినతి.. సోషల్‌మీడియా ద్వారా రైతులంతా ఏకం
- ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం.. మాఫీ అయ్యేదాకా పోరాడుతామని హెచ్చరిక
- రుణమాఫీ ధోకాపై మీరైనా జోక్యం చేసుకోండి.. గవర్నర్‌కు నెన్నెల రైతుల లేఖలు
Runa Mafi | హైదరాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ): రుణమాఫీ అమలుకాని రైతులు పోరుబాట పట్టారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్‌తో గురువారం చలో ప్రజాభవన్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాంకుల ముందు, ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్న రుణమాఫీ కాని రైతులు సోషల్‌మీడియా వేదికగా ఏకమవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం చలో ప్రజాభవన్‌కు తరలిరావాలంటూ సోషల్‌మీడియా వేదికగా ఒక యువ రైతు ఇచ్చిన పిలుపు వైరల్‌గా మారింది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రైతులంతా ఏకమై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తిచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీపై రైతులకు ఇచ్చిన మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నెల 20న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతులంతా తరలిరావాలని కోరారు. తమ పోరాటానికి అన్ని కుల సంఘాలు మద్దతు తెలపాలని కోరారు. రుణమాఫీ కాలేదనే బాధ తో రైతులు చనిపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఏకమవుతున్న రైతులు చలో ప్రజాభవన్ ఆందోళనకు తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
ఎక్కడికక్కడ గ్రామాల వారీగా రుణమాఫీ కాని రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. అయితే కఠిన నిబంధనలు, షరతులతో అర్హులైన రైతుల సంఖ్యలో కోత పెట్టారు. దాదాపు 70 లక్షల మంది రుణ గ్రహీతలు ఉండగా 42 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 23 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ప్రభుత్వం పేర్కొ న్న అన్ని అర్హతలు ఉన్న రైతుల్లో చాలామందికి ఇంకా మాఫీ కాలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..నిన్న ఒక్కరోజే 83,670 మంది దర్శనం
Ram Gopal Varma | ‘రామాయణం 2’ కలెక్షన్లు పార్ట్1 కంటే పదింతలు ఎక్కువ ఉంటాయి: రామ్ గోపాల్ వర్మ
IND vs NZ | నిలకడగా ఆడుతున్న కివీస్.. 20 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే..!
Health tips | విటమిన్ B12 లోపాన్ని లైట్ తీసుకుంటున్నారా.. గుండెకు, లివర్‌కు ప్రమాదమట తెలుసా..?
KCR | కేసీఆర్‌తో ఆదిలాబాద్ యువనేత భార్గవ్ దేశ్‌పాండే భేటీ
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

