Telangana | రైతులకు రుణమాఫీ ముగిసిన కథ.. అర్హులందరికీ ఇచ్చినం.. ఇగ ఇచ్చేదేం లేదు
Telangana | రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు. అర్హులైన రైతులందరికీ ఇప్పటికే రుణమాఫీ చేశామని, ఇక ఇచ్చేది కూడా ఏమీ లేదన్నట్టుగా మాట్లాడారు.
- అసెంబ్లీలో మంత్రి తుమ్మల సంచలన ప్రకటన
Telangana | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు. అర్హులైన రైతులందరికీ ఇప్పటికే రుణమాఫీ చేశామని, ఇక ఇచ్చేది కూడా ఏమీ లేదన్నట్టుగా మాట్లాడారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తుమ్మల బదులిచ్చారు.
రుణమాఫీ సర్వే సమయంలో కొంతమంది రైతుల వివరాలు తమకు ఇవ్వలేదని ఒప్పుకుంటూనే, చేయాల్సిన కాడికి రుణమాఫీ చేశామని చెప్పారు. ‘రుణమాఫీకి సంబందించి వీళ్ల దగ్గర (బీజేపీ ఎమ్మెల్యేల వైపు చూస్తూ) కన్ఫ్యూజన్ ఉన్నది. కానీ నా దగ్గర కన్ఫ్యూజన్ లేదు. ప్రభుత్వానికి అంతకంటే కన్ఫ్యూజన్ లేదు. చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఖాతాలు వేరు.. కుటుంబాలు వేరు.
ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు మీకు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే.. రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలు మాత్రమే మాఫీ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. రూ.2 లక్షలకుపైన లేదు. రూ.2 లక్షలలోపు బ్యాంకు రుణాలు ఉన్న కుటుంబాలు 25 లక్షలు ఉన్నట్టు మాకు వివరాలు చేరినయి అధ్యక్షా! ఆయా కుటుంబాలకు రూ.20,616 కోట్లు జమ చేయటం జరిగిందని గౌరవ సభ్యులకు సవినయంగా మనవి చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్ కావొద్దు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దు’ అని తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో స్పష్టంగా ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

