Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ముఖ్యమంత్రి బహుశా రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటాడేమోనన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
Niranjan reddy | రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 8న పుట్టిన రోజు జరుపుకున్నారని తెలిసిందే. అయితే వ్యక్తిగత కార్యక్రమాన్ని ప్రభుత్వ ఖర్చుతో జరుపుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఖర్చుతో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ముఖ్యమంత్రి బహుశా రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటాడేమోనన్నారు.
రేవంత్ రెడ్డి పుట్టినరోజు జరుపుకోవడం ఎవరికేమి ఇబ్బంది లేదు.. ఆలస్యంగా మేం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కానీ ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటైన వేదికల మీద తమ వేడుకలు చేసుకోవడం, రాజకీయాలు మాట్లాడటం, అది కూడా ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష పార్టీ నాయకులను దూషించడం రేవంత్ రెడ్డికే చెల్లిందన్నారు.
ప్రభుత్వ ఖర్చుతో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు
రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఖర్చుతో పుట్టినరోజు జరుపుకొని ప్రతిపక్షాలను తిడుతున్నాడు
– మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి https://t.co/3ZiVFUNvu9
— Telugu Scribe (@TeluguScribe) November 10, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
బాలికల పట్ల పారిశుధ్య కార్మికుడి అసభ్య ప్రవర్తన?
Harish Rao | ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటాం : హరీశ్ రావు
Aaryavir Sehwag: ఆర్యవీర్ సెహ్వాగ్ సెంచరీ
పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

