టోల్‌పాస్.. మనకు నై బాస్.. యాన్యువల్ టోల్ పాస్ స్కీమ్‌లో చేరని తెలంగాణ
రాష్ట్ర రవాణా శాఖ నిర్లక్ష్యం తెలంగాణలోని వాహనదారుల పాలిట శాపంగా మారనున్నది. టోల్ ప్లాజా ఫీజులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘యాన్యువల్ టోల్‌పాస్ స్కీమ్'లో తెలంగాణ నేటికీ చేరకపోవడం రాష్ట్రంలోని వాహనదారులకు మరింత భారంగా పరిణమించనున్నది. ఈ నెల 15న ప్రారంభిచనున్న ఈ పథకంలో తెలంగాణ మినహా మిగతా రాష్ర్టాలన్నీ చేరాయి.
- రవాణా శాఖ నిర్లక్ష్యం వాహన దారులకు శాపం
- మన వాహనాలను ‘వాహన్’ డాటాబేస్‌లో చేర్చని వైనం
- డీఎల్, ఆర్సీల మైగ్రేషన్ ప్రక్రియలో అంతులేని తాత్సారం
- సాంకేతిక సమస్యలకు తోడు వేధిస్తున్న సిబ్బంది కొరత
- రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తెలంగాణను పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం
- పంద్రాగస్టున ‘వార్షిక టోల్‌పాస్ పథకం’ ప్రారంభం – రూ.3 వేల పాస్‌తో ఏడాదంతా ‘టోల్-ఫ్రీ’
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర రవాణా శాఖ నిర్లక్ష్యం తెలంగాణలోని వాహనదారుల పాలిట శాపంగా మారనున్నది. టోల్ ప్లాజా ఫీజులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘యాన్యువల్ టోల్‌పాస్ స్కీమ్’లో తెలంగాణ నేటికీ చేరకపోవడం రాష్ట్రంలోని వాహనదారులకు మరింత భారంగా పరిణమించనున్నది. ఈ నెల 15న ప్రారంభిచనున్న ఈ పథకంలో తెలంగాణ మినహా మిగతా రాష్ర్టాలన్నీ చేరాయి. ఈ పథకం కింద కారు, జీప్, వ్యాన్ తదితర వాణిజ్యేతర వాహనదారులు ఏడాదికి రూ.3 వేలు చెల్లించి ‘ఫాస్టాగ్’ ఆధారిత టోల్‌పాస్‌ను తీసుకుంటే జాతీయ రహదారులపై 200 సార్లు టోల్-ఫ్రీ క్రాసింగ్లను అనుమతిస్తారు. ఆ తర్వాత 200 క్రాసింగ్‌లు పూర్తయితే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
కేంద్రం 3 నెలల క్రితమే వివరణ కోరినా..
దేశంలోని అన్ని రాష్ర్టాలు టోల్‌పాస్ పథకంలో చేరినప్పటికీ తెలంగాణ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి వీ ఉమాశంకర్ ఈ ఏడాది మే నెలలో తెలంగాణ చీఫ్ సెక్రటరీతోపాటు రాష్ట్ర రవాణాశాఖ అధికారుల వివరణ కోరారు. తెలంగాణలోని వాహనాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ‘వాహన్ పోర్టల్’లోకి తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు తప్పనిసరి. ఆ మైగ్రేషన్ ప్రక్రియ తీవ్రంగా ఆలస్యమవుతున్నది. మే నెల నుంచీ గత వారం వరకూ ఎలాంటి పురోగతి లేకపోవడంతో కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి మరోసారి తెలంగాణ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలోని వాహనాల డాటాను ‘వాహన్ పోర్టల్’కు తరలించే ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా రహదారి వినియోగదారులకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన వెసులుబాటు కల్పించేందుకు తెలంగాణ నుంచి అధికారిక జోక్యం అవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పథకం నుంచి రాష్ర్టాన్ని పక్కనపెట్టినట్టు తెలిసింది.
వేధిస్తున్న సాంకేతిక సిబ్బంది కొరత
ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి తోడు సాంకేతిక సిబ్బంది కొరత, వాహన రిజిస్ట్రేషన్ డాటా అసంపూర్తిగా ఉండటం, పాత రికార్డులు డిజిటలైజ్ కాకపోవడం తదితర సమస్యలతో రాష్ట్ర రవాణాశాఖ సతమతమవుతున్నది. తెలంగాణలోని వాణిజ్యేతర వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులతోపాటు రిజిస్టర్లను జాతీయ రిజిస్టర్లయిన సారథి, వాహన్‌లో విలీనం చేయడం సాంతకేతిక అంశాలతో కూడుకున్న అంశం.
వార్షిక టోల్‌పాస్ వల్ల ఉపయోగాలు
- రూ.3 వేలు చెల్లించి ‘ఫాస్టాగ్’ ఆధారిత యాన్యువల్ టోల్‌పాస్‌ను తీసుకుంటే రహదారులపై ఏడాదిలో 200 పర్యాయాలు టోల్‌ఫ్రీ క్రాసింగ్లను పొందవచ్చు.
- టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్ గుర్తింపు, త్వరిత క్లియరెన్స్‌కు ఈ పాస్ అనుమతిస్తుంది. దీంతో సమయం ఆదా అవుతుంది.
- దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఈ పాస్‌ను ఉపయోగించుకోవచ్చు. తరచూ ప్రయాణించే వారికి ఇది చాలా సౌకర్యవంతం.
- ‘వాహన్’ పోర్టల్ నుంచి రియల్-టైమ్ ధ్రువీకరణ ద్వారా ఈ సీమ్ సమర, పారదర్శకమైనని కానున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

