గాయత్రి ప్రాజెక్ట్స్ ఓటీఎస్‌కు ఎన్సీఎల్టీ ఆమోదం
కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బిరామిరెడ్డికి సంబంధించిన గాయత్రి ప్రాజెక్ట్స్ ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఊరట లభించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బిరామిరెడ్డికి సంబంధించిన గాయత్రి ప్రాజెక్ట్స్ ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఊరట లభించింది. కెరాన బ్యాంకులో గాయత్రి ప్రాజెక్ట్స్‌కు ఉన్న మొత్తం రూ.8,100 కోట్ల అప్పులో రూ.2,400 కోట్లను వన్-టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పద్ధతిలో చెల్లించేందుకు ఆ కంపెనీ చేసిన ప్రతిపాదనను ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ ఆమోదించడంతోపాటు ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు 90 రోజుల గడువు ఇచ్చినట్టు ఓ ఆంగ్ల మీడియా వెల్లడించింది.
కంపెనీ ప్రమోటర్లు రూ.750 కోట్లు చెల్లించడంతోపాటు మిగిలిన మొత్తాన్ని ఆస్తుల మానిటైజేషన్, పెట్టుబడిదారుల నుంచి నిధుల సమీకరణ తదితర మార్గాల చెల్లించేందుకు ముందుకొచ్చినట్టు తెలిపింది. దీంతో గత మూడేండ్ల నుంచి కొనసాగుతున్న ఈ వివాదం ముగింపు దశకు చేరినట్టు పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eetha Trailer | ‘ఛావా’ దర్శకుడి కొత్త సినిమా.. శ్రద్ధా కపూర్ ‘ఈతా’ ట్రైలర్ విడుదల!
‘పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి’
Europe | వాతావరణ మార్పులతోనే యూరప్‌లో ఎండలు.. 50వేల మరణాలకు అవే కారణం..
‘సీతారామ ప్రాజెక్టుతో సింగరేణి మండలానికి ఒరిగిందేమీ లేదు’
Hansika | హన్సిక పేరుతో ప్రైవేట్ వీడియో కలకలం.. డీప్‌ఫేక్ ప్రచారంపై అసలు నిజం ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

