Nagarjuna Sagar | కుడి కాలువకు కొనసాగుతున్న నీటి విడుదల.. డెడ్ స్టోరేజీకి చేరువలో సాగర్
నాగార్జున సాగర్‌లో (Nagarjuna Sagar) ఉధ్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డ్యామ్ 13వ గేట్ వరకు ఆక్రమించుకున్న ఆంధ్రా పోలీసులు కుడి కాలువకు (Right Canal) నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుతం నీటినిల్వ 522 అడుగులకు చేరింది.
హైదరాబాద్: నాగార్జున సాగర్‌లో (Nagarjuna Sagar) ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డ్యామ్ 13వ గేట్ వరకు ఆక్రమించుకున్న ఆంధ్రా పోలీసులు కుడి కాలువకు (Right Canal) నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుతం నీటినిల్వ 522 అడుగులకు చేరింది. నీటి విడుదల ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి (Dead Storage) చేరే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు సుమారు 4 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ (Andhra Pradesh) విడుదలచేసుకున్నది. మరో 12 అడుగుల మేర నీటిని విడుదల చేస్తే డెడ్ స్టోరేజీకి చేరుతుందని అధికారులు తెలిపారు. కాగా, డ్యామ్‌కు ఇరువైపులా ఇరు రాష్ట్రాలు భారీగా పోలీసులను మోహరించాయి. ఐజీ స్థాయి అధికారులు సాగర్ చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉన్నది.
నాగార్జునసాగర్ డ్యామ్‌పై బుధవారం రాత్రి నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఏపీ ఇరిగేషన్ అధికారులు సుమారు 500 మంది పోలీసులతో బుధవారం అర్ధరాత్రి ఆంధ్రా ప్రాంతం వైపు ఉన్న ఎంట్రెన్స్ నుంచి డ్యామ్‌పైకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆంధ్రా పోలీసులు డ్యామ్ సెక్యూరిటీ గేట్‌పైనుంచి దూకి, గేట్ మోటర్‌ను ధ్వంసం చేసి గేట్‌ను తెరుచుకొని లోపలికి చొరబడ్డారు. వారిని నియంత్రిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బందిపై దాడిచేశారు.
డ్యామ్ సీసీ కెమెరాలు, ఎస్పీఎఫ్ సిబ్బంది ఫోన్లను ధ్వంసం చేశారు. డ్యామ్ 13వ గేట్ వరకు డ్యామ్ తమదని, అక్కడ ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డును మూసి వేశారు. దాంతో రాకపోకలు నిలిచిపోయాయి. డ్యామ్‌పై విధులు నిర్వహించే సిబ్బంది 13వ గేట్ దాటి అటువైపు ఉన్న తెలంగాణ కంట్రోల్ రూమ్ వైపు వెళ్లలేకపోయారు. తెలంగాణ పోలీస్ అధికారులు వచ్చి పరిస్థితిని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యామ్ పైన ఇదే పరిస్థితి నెలకొన్నది. కాగా డ్యామ్ నిర్వహణ అంతా తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది. ఆంధ్రా సర్కారుకు ఆ బాధ్యత లేదు. కృష్ణా రివర్ బోర్డు సూచించిన నీటి వాటాల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు డ్యామ్‌లోని నీటిని వినియోగించుకుంటాయి. ఈ నీటి వినియోగం విషయంలో పలుమార్లు ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. కాగా, సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అక్రమంగా నీటిని విడుదల చేసుకుంటుండటంతో కృష్ణా ట్రిబ్యునల్‌కు తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
Protein Idly | ఇడ్లీలను ప్రోటీన్లు ఉండేలా ఆరోగ్యకరంగా ఇలా తయారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు
‘ఏఐటీయూసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

