Munugode By polls Results | మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం దిశగా దూసుకెళ్తున్నది. రౌండ్ల వారీగా టీఆర్ఎస్ ఆధిక్యం పెరుగుతూ వస్తున్నది. ఇప్పటి వరకు 13 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తవగా.. టీఆర్ఎస్ ఆధిక్యం 9,039కు పెరిగింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 6,691, బీజేపీకి 5,406 ఓట్లు పోలవగా.. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 1,285 ఓట్ల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం 14వ రౌండ్ ఓట్ల లెక్కింపు మొదలైంది. మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖరారు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులకు సంబురాలు జరుపుతున్నాయి. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ భవన్‌తో సహా జిల్లాల్లో బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచారు.