లుక్ఔట్ నోటీసులు రద్దు చేయండి : ఎంపీ సుజనా చౌదరి

హైదరాబాద్ : అమెరికాలో జరిగే ఒక సదస్సుకు హాజరుకావాల్సి ఉందని.. ఈ మేరకు తనకు ఆహ్వానం అందిందని.. తనపై జారీయైన లుక్ఔట్ నోటీసుపై అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా కోరుతూ ఎంపీ సుజనా చౌదరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ సందర్భంగా పిటిషన్లో ఆహ్వాన పత్రిక ఎందుకు సమర్పించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఆహ్వానం లేకుండా అత్యవసరంగా విచారణ చేయలేమని చెప్పింది.
రుణాలు తీసుకుని దుర్వినియోగం చేయడమే కాకుండా బ్యాంకుల్ని మోసం చేశారని సీబీఐ నమోదు చేసిన అభియోగాల కేసులో ఇమిగ్రేషన్ కమిషనర్ జారీ చేసిన లుక్ఔట్ నోటీసులను రద్దు చేయాలనే అత్యవసర పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం విచారించారు. రూ.71.46 కోట్ల మేరకు బ్యాంకుల్ని మోసం చేశారనే అభియోగాలపై విద్యుత్ పరికరాల తయారీ పరిశ్రమ బెస్ట్ అండ్ క్రాఫ్టన్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్పై సీబీఐ, ఈడీలు వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి.
ఈ కేసులో సుజనా చౌదరికి ప్రమేయం ఉందని 2019 జూన్ 18న లుక్ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. తనకే సంబంధం లేదని వినతిపత్రం ఇచ్చినా ఫలితంలేదని, లుక్ఔట్ నోటీసు రద్దు చేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆహ్వాన పత్రిక అందజేస్తామని న్యాయవాది చెప్పడంతో కేసు విచారణ జూలై 7కి హైకోర్టు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

