Etela Rajender | రైతుల ఇష్టప్రకారమే భూసేకరణ జరగాలి.. బలవంతంగా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు: ఎంపీ ఈటల
భూసేకరణ రైతుల ఇష్టప్రకారం జరగాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) అన్నారు. కొడంగల్ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్ సేవలు, కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులను గ్రామాల్లో మోహరించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్: భూసేకరణ రైతుల ఇష్టప్రకారం జరగాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) అన్నారు. కొడంగల్ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్ సేవలు, కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులను గ్రామాల్లో మోహరించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కలెక్టర్, అధికారులపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని, అయితే రైతులపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని వెల్లడించారు. భూసేకరణ రైతుల ఇష్ట ప్రకారం జరగాలి తప్ప.. బలవంతంగా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. గతంలో ముచ్చర్లలో ఫార్మా సిటీ కోసం భూములు సేకరించినప్పుడు ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించదని ఆయన గుర్తుచేశారు. అప్పుడు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు భూములు గుంజుకుని రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులపై దాడిని ఖండిస్తున్నామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. దుద్యాల ఘటన ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని చెప్పారు. దాడి వెనుక ఎవరున్నా సహించేది లేదని చెప్పారు. ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

