ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు
ముఖ్యమంత్రి కేసీఆర్ | ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసల వర్షం కురిపించారు. దళితుల అభ్యున్నతి

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసల వర్షం కురిపించారు. దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అని కొనియాడారు. ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా దళితుల కోసం ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదు. దళితుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ 10 గంటల పాటు చర్చించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ సమావేశంలో దళితుల అభ్యున్నతిలో భాగంగా సామాజిక, ఆర్థికపరమైన అంశాలపై సీఎం చర్చించి, భరోసానివ్వడం అభినందించదగ్గ విషయమని మోత్కుపల్లి పేర్కొన్నారు.
కుల రహిత సమాజం రావాలి
కులరాహితమైన సమాజం రావడం కోసం మార్పులు అవసరం అని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. అయితే సామాజిక భద్రత విషయంలో తీవ్రంగా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారన్నారు. ముఖ్యమంత్రి మనసు పేద ప్రజల పక్షాన నిలవడం సంతోషాన్నిస్తుందన్నారు. రూ. 10 లక్షలు ఒక్క కుటుంబానికి ఇవ్వడం అసాధ్యం కానీ.. సీఎం కేసీఆర్ సుసాధ్యం చేశారని కొనియాడారు. నియోజకవర్గానికి 100 దళిత కుటుంబాలను ఎంపిక చేసి.. రూ. 10 లక్షల చొప్పున ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు.
అన్ని రంగాల్లో దళిత విద్యార్థులు
కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. గురుకుల విద్యాలయాలు ఎంతో మెరుగుపడ్డాయని మోత్కుపల్లి స్పష్టం చేశారు. ఈ గురుకులాల్లో చదివిన దళిత విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లోనే కాకుండా, విదేశాల్లోనూ విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు.
బీజేపీ దళితుల వ్యతిరేక పార్టీ
సీఎం సమావేశాన్ని బహిష్కరించాలని అనడం సరియైంది కాదు అని నర్సింహులు అన్నారు. బీజేపీ దళితుల వ్యతిరేక పార్టీ అనే ముద్ర ఉందన్నారు. దళితులకు ఎన్ని లక్షల కోట్లు అయిన ఖర్చు పెడుతా అనడం అభినందనీయం, హర్షించదగ్గ విషయమన్నారు. దళితులకు రూ. 10 లక్షలు ఇస్తాను అన్న మొనగాడు లేడు, సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షించాలి అని చెప్పారు. బీజేపీ లో కొంత మంది వ్యాపారులు చేరారు. వారు చెప్పే విధానం కరెక్ట్ కాదు. వారి మాటలు వింటే పార్టీ ఆగం అవుతుంది అని మోత్కుపల్లి ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

