MLC Kavitha | కాంగ్రెస్ వైఫల్యాలే బీఆర్ఎస్ విజయానికి సోపానాలు : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | కాంగ్రెస్ వైఫల్యాలే భారత్ రాష్ట్ర సమితి విజయానికి సోపానాలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రజల దీవెనలతో కేసీఆర్ తప్పకుండా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
MLC Kavitha | నిజామాబాద్ : కాంగ్రెస్ వైఫల్యాలే భారత్ రాష్ట్ర సమితి విజయానికి సోపానాలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రజల దీవెనలతో కేసీఆర్ తప్పకుండా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు.
కాంగ్రెస్‌లో గ్రూపులే తమ పార్టీ విజయానికి కారణమవుతాయని కవిత పేర్కొన్నారు. ఆస్తులు అమ్ముకోవడం కాంగ్రెస్ నైజం అని ధ్వజమెత్తారు. ఆర్టీసీ అభివృద్ధి కోసమే ప్రభుత్వంలో విలీనం చేశాం. కానీ ఆర్టీసీ విలీనాన్ని కాంగ్రెస్ పార్టీ వివాదం చేస్తుందని మండిపడ్డారు. సెక్రటేరియట్ నిర్మాణంపై కూడా కాంగ్రెస్ వివాదం చేసింది. నేలమాళిగలు, గుప్తా నిధుల కోసం సచివాలయం కడుతున్నామని ఆ పార్టీ నాయకులు అన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల విలీనం విషయంలోనూ ఆస్తుల కోసం అంటూ ఆగమాగం చేస్తున్నారని కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రుణమాఫీ తమ ఎన్నికల ఎజెండా.. ఇది కాంగ్రెస్ విజయం అనడం హాస్యాస్పదం అని కవిత అన్నారు. రుణమాఫీ కాంగ్రెస్ విజయం కాదు.. కానీ మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం మాత్రం కాంగ్రెస్ విజయమే అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎప్పుడైనా, ఏ పని అయినా బాజాప్తా చెప్పి చేస్తారు. రూ. 19 వేల కోట్ల నిధులతో 35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి అర్థం లేని ఆరోపణలు అని కవిత ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

