యాదగిరిగుట్ట, మే 4: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. సోమవారం పట్టణంలో బీఆర్ఎస్ కార్యాలయం నుంచి పాతగుట్ట చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పాతబస్‌స్టాండ్ వద్ద అయిలయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలని డిమాండ్‌చేశారు.