శాంతిభద్రతలు దిగజారుతున్నయ్
రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోతుండటంపై మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న అడ్వొకేట్ ఖాజా మొయినుద్దీన్‌ను పట్టపగలే నెంబర్ ప్లేట్ లేని వాహనంతో ఢీకొట్టి చంపడంపై మంత్రివర్గ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది.
- ప్రస్తావనకు రాని జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశం
- ధాన్యం కొనుగోళ్ల తీరుపై సహచర మంత్రుల గరంగరం
- క్యాబినెట్ సమావేశంలో మంత్రుల ఆందోళన
హైదరాబాద్, మే 23(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోతుండటంపై మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న అడ్వొకేట్ ఖాజా మొయినుద్దీన్‌ను పట్టపగలే నెంబర్ ప్లేట్ లేని వాహనంతో ఢీకొట్టి చంపడంపై మంత్రివర్గ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి శాంతిభద్రతల విషయంలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని అన్నారు.
క్యాబినెట్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయమై ఈ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీ పక్కకు పోయినట్టు తెలిసింది. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని, గతంలో ఎప్పుడూ లేనంత వడగాల్పుతో రైతులకు వడదెబ్బ తగిలి మరణిస్తున్నారని ఉత్తర తెలంగాణ మంత్రి ఒకరు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. 80శాతం ధాన్యం కొనుగోలు చేశామని, మరో 20శాతం ధాన్యమే కల్లాల్లో ఉన్నాయని సహచర మంత్రి ఇచ్చిన సమాధానంపై మంత్రివర్గం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chinese Food | చైనీస్ ఫుడ్ వండేటప్పుడు పాత్రలపై మంటలు వస్తాయి.. ఎందుకని..?
Vatsala Rajagopal | ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ కన్నుమూత!
Kranthi Kiran | కరువు మండలాలుగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలి : మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
‘భట్టి విక్రమార్క రాజీనామా చేయాలి.. సీపీని వెంటనే బదిలీ చేయాలి’
Watch: మద్యం మత్తులో వాహనం నడిపిన మహిళా కానిస్టేబుల్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

