ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి : మంత్రి సత్యవతి
minister satyavathi | ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారిని కుటుంబంతో కలిసి
హైదరాబాద్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారిని కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయానికి వచ్చిన మంత్రికి దేవస్థానం పాలకమండలి చైర్మన్ బాలాగౌడ్, ఈవో, ధర్మకర్తలు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి వనదుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక అర్చనలు, పూజలు న్విహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భారతదేశం గంగా, యమున, సరస్వతీ నదుల సమ్మేళనమని, అలాంటి పవిత్ర భూమిలో బీజేపీ ప్రభుత్వం అల్లకల్లోలం చేస్తుందని మండిపడ్డారు.
బీజేపీ దుందుడుకు చర్యలను అరికట్టేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని నెలకొల్పారన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతూ అన్నదాతలకు ఉచిత విద్యుత్‌ను అందించాలన్న తలంపుతో జాతీయ స్థాయిలో పార్టీని నెలకొల్పేందుకు బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసి నిధులు కేటాయించారని, పుణ్యక్షేత్రాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను దేశ ప్రజలకు అదందించి ప్రజాసంక్షేమం కోసం కృషి చేయాలన్న దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
World Telugu Sahithi Conference | చైనాలో ఘనంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

