జీవో 317 సమస్యలను పరిషరించాలి
జీవో నంబర్ 317 అమలులో ఏర్పడిన సమస్యలను వెంటనే పరిషరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌కు పీఆర్టీయూ టీఎస్ విజ్ఞప్తిచేసింది.
- క్యాబినెట్ సబ్ కమిటీకి పీఆర్టీయూటీఎస్ వినతి
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): జీవో నంబర్ 317 అమలులో ఏర్పడిన సమస్యలను వెంటనే పరిషరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌కు పీఆర్టీయూ టీఎస్ విజ్ఞప్తిచేసింది. సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కలిసి మంత్రులకు వినతిపత్రం అందజేశారు.
వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలని, స్థానికత ఆధారంగా ఉపాధ్యాయులను సొంత జిల్లాకు బదిలీ చేయాలని, సీనియారిటీకి రక్షణ కల్పిస్తూ పరస్పర బదిలీలను అమలు చేయాలని విజ్ఞప్తిచేశారు. క్యాడర్ స్ట్రెంత్ సరిచేయాలని, మెడికల్, వితంతు ప్రాధాన్యతలను గుర్తించాలని కోరారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఈ అంశాలను ప్రతిపాదనల రూపంలో ప్రభుత్వానికి సమర్పించి, ఉత్తర్వులు విడుదల చేస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్టు నేతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

