Palamuru Lift | పాలమూరు ఎత్తిపోతల పనులు వేగవంతం : మంత్రి నిరంజన్ రెడ్డి
Palamuru Lift | నాగర్‌కర్నూల్ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పనులను వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కొల్లాపూర్ మండల పరిధిలోని నార్లపూర్ రిజర్వాయర్ పనులను సీఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, ఎంపీ రాములు, కలెక్టర్ ఉదయ్, ఈఎన్సీ మురళీధర్ రెడ్డి పరిశీలించారు.
Palamuru Lift | నాగర్‌కర్నూల్ : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పనులను వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కొల్లాపూర్ మండల పరిధిలోని నార్లపూర్ రిజర్వాయర్ పనులను సీఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, ఎంపీ రాములు, కలెక్టర్ ఉదయ్, ఈఎన్సీ మురళీధర్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలిసారిగా పాలమూరు ఎత్తిపోతల పనులపై సమీక్ష నిర్వహించారని గుర్తు చేశారు. 2014లో తొలి కేబినెట్లో కూడా పాలమూరు ఎత్తిపోతల చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 22 నియోజకవర్గాలకు సాగు, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. వెనుకబడిన ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. కొంత మంది నాయకులు కావాలనే ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు. కృష్ణా నది జలాల్లో కేంద్రం తెలంగాణ వాటా తేల్చకపోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. అయితే తెలంగాణ వాటాకు లోబడే ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతుందన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. రెండున్నర నెలల్లో పనులను పూర్తి చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

