కెంగర్ల మల్లయ్యకు సముచిత స్థానం కల్పిస్తాం : కేటీఆర్
కెంగర్ల మల్లయ్య | సింగరేణి బీఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య తిరిగి సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్

హైదరాబాద్ : సింగరేణి బీఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య తిరిగి సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో తన అనుచరులతో కలిసి మల్లయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు ఏ హామీలు అయితే ఇవ్వడం జరిగిందో.. అన్నింటినీ నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఏడు సంవత్సరాలుగా ప్రతి కార్మికుడికి లాభం చేయడం జరిగిందన్నారు. న్యాయపరమైన చిక్కులను సావధానంగా పరిష్కరించుకుందామని తెలిపారు.
13 నుంచి 14 నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా, మరో 15 నుంచి 20 నియోజకవర్గాల్లో పరోక్షంగా సింగరేణి కార్మికుల పాత్ర ఉంటుందని తెలిపారు. ఈ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు టీఆర్ఎస్ పార్టీతో కలిసి క్రియాశీలకంగా పని చేయాలన్నారు. కెంగర్ల మల్లయ్యకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. మనం కలిసికట్టుగా ఉంటే.. ఇతర సంఘాలకు, పార్టీలకు నూకలు చెల్లవు అని స్పష్టం చేశారు. కార్మికులందరూ ఏకపక్షంగా ఉండాలని సూచించారు. సింగరేణి ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా కార్మికులతో కలిసిపోవాలన్నారు. అందరం కలిసికట్టుగా నడవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

