అద్భుత టూరిస్ట్ డెస్టినేషన్‌గా మానేరు రివర్ ఫ్రంట్
మానేరు రివర్ ఫ్రంట్ | అద్భుత టూరిస్ట్ డెస్టినేషన్‌గా మానేరు రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : అద్భుత టూరిస్ట్ డెస్టినేషన్‌గా మానేరు రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో వివిధ శాఖల అధికారులతో కలిసి మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి కేవలం కరీంనగర్‌కే కాకుండా తెలంగాణకే తలమానికంగా ఉండాలన్నారు. దేశంలోని ఇతర రివర్ ఫ్రంట్ల కన్నా అద్భుతంగా అభివృద్ధి చేయాలని సూచించారు. మానేరు రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్‌ని దేశంలోని ఇతర ప్రాజెక్టుల కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రాజెక్టుతో సంబంధమున్న ఇరిగేషన్, రెవెన్యూ, టూరిజం, మునిసిపల్, ఆర్అండ్బి, పంచాయతీరాజ్ వంటి శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం కోసం రూ. 310 కోట్లు కేటాయించిన నేపథ్యంలో అద్భుతమైన డిజైన్లతో ఈ ఫ్రంట్‌ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టు కేవలం కరీంనగర్ పట్టణానికి కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక టూరిస్ట్ అట్రాక్షన్ గా మారే అవకాశం ఉన్నదని, పూర్తిస్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్, వరంగల్ వంటి జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కరీంనగర్ పట్టణానికి ఐటీ టవర్ ద్వారా ఐటీ పరిశ్రమ కంపెనీలను తరలించే ప్రయత్నం చేస్తున్నామని, రివర్ ఫ్రంట్ కార్యక్రమం పూర్తయిన తర్వాత కరీంనగర్ పట్టణం మరింతగా అభివృద్ధి అవుతుందన్న ఆశాభావం కేటీఆర్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేవలం సాగునీరు కాకుండా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల తోపాటు టూరిజం రంగంలోనూ అనేక అవకాశాలు వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. మానేరు రివర్ ఫ్రంట్‌లో అంతర్భాగమైన ఐదు చెక్ డాంలు, కేబుల్ బ్రిడ్జి పూర్తి కావస్తున్నాయి అని గంగుల కమలాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు ఈ రివర్ ఫ్రంట్‌ని అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

