KTR | పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై జాగ్రత్తలు తీసుకోవాలి.. ఆదేశించిన మంత్రి కేటీఆర్
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక చర్యలపై కలెక్టర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు.
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక చర్యలపై కలెక్టర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి. సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇతర శాఖలతో మున్సిపల్ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
నిండిన చెరువులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలకు ప్రతి జిల్లాలో కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. రహదారులపై పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్‌ని చేపట్టాలన్నారు. ప్రజలు మంచినీరు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలు తొలగగించాలి. విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకొని మరమ్మతులు చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

