Minister KTR | సాయిచంద్ భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి కేటీఆర్
ప్రముఖ గాయకుడు సాయిచంద్ (Sai Chand) భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు.
హైదరాబాద్: ప్రముఖ గాయకుడు సాయిచంద్ (Sai Chand) భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేటీఆర్ వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రసమయి బాలకిషన్, టీఎస్ఎమ్మెస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.

అనంతరం మాట్లాడుతూ.. సాయిచంద్ అద్భుతమైన కళాకారుడని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారని వెల్లడించారు. సాయిచంద్ మరణం తీరని లోటని తెలిపారు. ఉద్యమంలో పాటల ద్వారా అందరిని ఏకం చేశారన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా పాటలు పాడారని చెప్పారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించారు.

మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లనున్నారు. సాయిచంద్ భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. కాగా, గురువారం మధ్యాహ్నం వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్ స్మశానవాటికలో సాయిచంద్ అంత్యక్రియలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చూస్తున్నారు. మధ్యాహ్నం సాయిచంద్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానున్నది.




Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

