కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే మహాధర్నా : మంత్రి హరీశ్‌రావు
TRS Mahadharna | తెలంగాణ రైతుల పక్షాన నిలబడేందుకు టీఆర్ఎస్ పార్టీ రేపు మహాధర్నాను తలపెట్టిందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇందిరా పార్కు వద్ద టీఆర్ఎస్ మహాధర్నా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో

హైదరాబాద్ : తెలంగాణ రైతుల పక్షాన నిలబడేందుకు టీఆర్ఎస్ పార్టీ రేపు మహాధర్నాను తలపెట్టిందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇందిరా పార్కు వద్ద టీఆర్ఎస్ మహాధర్నా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి హరీశ్‌రావు పరిశీలించారు.
అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధర్నా నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా.. తాము ప్రజల పక్షాన ఉంటామన్నారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను, లోయర్ సీలేరు పవర్ ప్లాంట్‌ను అన్యాయంగా ఆంధ్రాలో కలిపారు. దీని వల్ల సంవత్సరానికి రూ. వెయ్యి కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. ఏడు మండలాలను, లోయర్ సీలేరును ఆంధ్రాలో కలిపిన నాడే కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఇవాళ కూడా లక్షలాది మంది రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ మహాధర్నా చేపట్టబోతున్నాం. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలి. పంజాబ్‌లో పండించే ప్రతి గింజను కొంటున్నారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని మాత్రం కొనడం లేదు. ఈ పద్ధతి సరికాదు. వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే. రాష్ట్ర రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రజలు, రైతుల కోసమే ఈ ధర్నా అని తేల్చిచెప్పారు. మహాధర్నా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా చేయబోతున్నాం. ఈ ధర్నాలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొంటారు అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
Malasiya | భారతీయులకు మలేషియా షాక్.. వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
Aadhar Card | ‘పుట్టిన తేదీకి ఆధార్ కార్డ్ ధ్రువపత్రం కాదు’
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

