Gangula Kamalaker | బీసీలు వెనుకబడలేదు.. గత పాలకుల నిర్లక్ష్యమే వెనుకబడేసింది: మంత్రి గంగుల
బీసీలు (BC) వెనుకబడ్డ వారు కాదని గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. బీసీలతోపాటు యావత్ తెలంగాణ సమాజానికి రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఎనలేని సేవ చేస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్: బీసీలు (BC) వెనుకబడ్డ వారు కాదని గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. బీసీలతోపాటు యావత్ తెలంగాణ సమాజానికి రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఎనలేని సేవ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్‌గా పల్లె రవికుమార్ గౌడ్ (Palle Ravikumar goud) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే ప్రభుత్వం తమదని, కల్యాణ లక్ష్మి రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా అన్నారు.
రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. అభివృద్ధి కోసం నీరాకేఫ్‌ను ప్రారంభించడంతోపాటు గౌడబీమాను ప్రకటించారని చెప్పారు. కల్లుగీత వృత్తిదారుల కార్పొరేషన్ చైర్మన్‌గా ఉద్యమకారుడు, బీసీ బిడ్డ అయిన పల్లె రవికుమార్‌కు అవకాశం కల్పించారని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలోని గౌడ వృత్తిదారులందరికీ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BC
- CM KCR
- Goudabeema
- jagadish reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

