శాసన మండలి ప్రొటెం చైర్మన్‌గా అమీనుల్ హసన్ జాఫ్రీ బాధ్యతల స్వీకరణ
Syed Aminul Hasan Jafri | రాష్ట్ర శాసన మండలి ప్రొటెం చైర్మన్‌గా సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి నర్సింహచార్యులు, మంత్రులు మహమూద్ అలీ, వేముల

హైదరాబాద్ : రాష్ట్ర శాసన మండలి ప్రొటెం చైర్మన్‌గా సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి నర్సింహచార్యులు, మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రొటెం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జాఫ్రీకి అసెంబ్లీ కార్యదర్శి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.
సీనియర్ పాత్రికేయుడు, ఎమ్మెల్సీ సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీని శాసనమండలి చైర్మన్ ప్రొటెంగా ప్రభుత్వం నిన్న నియమించిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు ఈ బాధ్యతలు నిర్వర్తించిన వెన్నవరం భూపాల్‌రెడ్డి పదవీ కాలం, శాసనమండలి సభ్యత్వం ఈ నెల 4తో ముగిసింది. దీంతో మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ స్థానాలు భర్తీ అయ్యే వరకు ఎమ్మెల్సీ జాఫ్రీని చైర్మన్ ప్రొటెంగా నియమించాలని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు ఉత్తర్వులు జారీచేశారు.
జాఫ్రీ ప్రస్థానం
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పీజీ చేసిన సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ.. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ పత్రికల్లో దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు జర్నలిస్ట్‌గా పనిచేశారు. ఎంఐఎం ఆహ్వానం మేరకు 2010లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ప్రస్తుతం నాలుగోసారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. చైర్మన్ ప్రొటెంగా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు జాఫ్రీ కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్‌గా పనిచేసి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్న కే కేశవరావుతోపాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా సేవలందించిన బీహార్ నేత హరివంశరాయ్ బచ్చన్ కూడా పూర్వాశ్రమంలో పాత్రికేయులే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

