Mahabubabad | పాలల్లో పురుగు మందు కలిపి కన్నబిడ్డలనే కడతేర్చారు!
చిన్నారులకు పాలల్లో పురుగు మందు కలిపి హతమార్చిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు కథనం ప్రకారం.. సీతంపేట గ్రామ పంచాయతీ శివారు అంకన్నగూడేనికి చెందిన పెండగట్ల అనిల్‌కుమార్, దేవికి ఐదేండ్ల క్రితం వివాహమైంది.
- ఈ దారుణం తల్లిదండ్రుల పనే?
Mahabubabad | గార్ల, మార్చి 10: చిన్నారులకు పాలల్లో పురుగు మందు కలిపి హతమార్చిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు కథనం ప్రకారం.. సీతంపేట గ్రామ పంచాయతీ శివారు అంకన్నగూడేనికి చెందిన పెండగట్ల అనిల్‌కుమార్, దేవికి ఐదేండ్ల క్రితం వివాహమైంది. వీరికి లోహిత(2), 11 నెలల జస్విత ఉన్నారు. అనిల్ ట్రాక్టర్ డ్రైవింగ్‌తోపాటు వ్యవసాయం చేస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వారం రోజులుగా వీరు అత్తగారిల్లు అయిన నామాలపాడులో ఉంటున్నారు. శనివారం సాయంత్రం అంకన్నగూడెం వచ్చారు.
రాత్రి భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు కాని, ఇద్దరు చిన్నారులకు పాలల్లో పురుగు మందు కలిపి తాగించారు. వెంటనే అనిల్‌కుమార్, దేవి అక్కడి నుంచి పారిపోయారు. పక్కనే ఉండే చిన్నారుల తాత పెండగట్ల వెంకన్న ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లి చూడగా ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్టు గమనించి ఇరుగు పొరుగు వారికి తెలిపాడు. మంచం పక్కన పాల డబ్బా, పురుగుమందు డబ్బా పడి ఉన్నాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ తిరుపతి, గార్ల-బయ్యారం సీఐ రవి, ఎస్సై జీనత్‌కుమార్ అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. వెంకన్న ఫిర్యాదుతో ఎస్సై జీనత్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

