మూడు దశాబ్దాలకుపైగా అజ్ఞాతంలోనే.. ఎట్టకేలకు బందూక్ వీడి జనంలోకి..
అన్నలతో కలిసి అప్పటికే సుదీర్ఘ ప్రయాణం సాగించిన ఆ ఇంటి పెద్ద బిడ్డ 27 ఏండ్లుగా ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి.. అయితే ఇప్పుడా ఆ వ్యక్తి బందూక్ వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. దాదాపు మూడు దశాబ్దాలుగా కన్న కొడుకు కోసం ఎదురుచూసిన ఆ అవ్వ.. తన కొడుకు లొంగిపోయినందుకు ఆనందపడుతున్నది.
- లొంగిపోయిన మావోయిస్టు పార్టీ ఎంఎంసీ జోన్ ఇన్చార్జ్ అనంత్
- దశాబ్దాల తర్వాత కన్నకొడుకు జాడ తెలియడంతో తల్లి ఆనందం
జగిత్యాల, నవంబర్ 29(నమస్తే తెలంగాణ) : అన్నలతో కలిసి అప్పటికే సుదీర్ఘ ప్రయాణం సాగించిన ఆ ఇంటి పెద్ద బిడ్డ 27 ఏండ్లుగా ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి.. అయితే ఇప్పుడా ఆ వ్యక్తి బందూక్ వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. దాదాపు మూడు దశాబ్దాలుగా కన్న కొడుకు కోసం ఎదురుచూసిన ఆ అవ్వ.. తన కొడుకు లొంగిపోయినందుకు ఆనందపడుతున్నది. ఇదీ మహారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లాలో శుక్రవారం లొంగిపోయిన ఎంఎంసీ (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్) జోన్ ఇన్చార్జ్ అనంత్ అలియాస్ వినోద్ ప్రస్తానం. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటకు చెందిన మాజీ మావోయిస్టు సాయన్న పెద్దకొడుకు అనంత్ అలియాస్ మ్యాకల వినోద్ మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఎంఎంసీ జోన్ కార్యదర్శిగా కొనసాగుతున్నాడు.
27ఏండ్ల నుంచి ఇప్పటి వరకు అనంత్ అలియాస్ వినోద్ ఆచూకీ ఆయన కుటుంబ సభ్యులకు తెలియలేదు. అలాగే అనంత్‌కు సైతం వారి కుటుంబ సభ్యుల ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో మూడురోజుల క్రితం మహారాష్ట్రలోని అడవుల్లో అనంత్ ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను ప్రస్తావించాడు. తాము మహారాష్ట్రకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు సతీశ్దాదా, తెలంగాణకు చెందిన సోనుదాదా (మల్లోజుల వేణుగోపాల్) మార్గాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించాడు.
2026 జనవరి 1 వరకు లొంగిపోతామని, ఇతర సభ్యులకు సైతం ఈ విషయం చెప్పినట్టు తెలిపాడు. తాను 10వ తరగతి చదువుతూనే పార్టీ కార్యకలాపాల్లోకి వెళ్లానని, పార్టీనే తనను ముంబై, నాగపూర్‌ల్లో కాలేజీల్లో చదివించిందని వివరించాడు. నాగపూర్‌లో విద్యార్థి విభాగం ఆర్గనైజేషన్‌లో పాల్గొన్నానని, తదుపరి దశంలోకి వెళ్లానని తెలిపాడు. మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన 24 గంటల్లోనే అనంత్ గడ్చిరోలి ఐజీ ఎదుట 11మందితో కలిసి లొంగిపోయాడు.
నంద్యాలలో మావోయిస్టుల కలకలం.. కొలిమిగుండ్లలో పోలీసుల సోదాలు
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఎర్రమలకొండలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో ఛత్తీస్‌గఢ్, ఏపీ పోలీసులు సోదాలు చేపట్టారు. నేలబిళం, ఓబులేసుకోన, ఎర్రకోనలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 20మంది పోలీసులు గాలించారు. కొలిమిగుండ్లను షెల్టర్‌జోన్‌గా చేసుకున్నారనే అనుమానంతో గాలింపు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

