చోటా నయీమ్ మల్లన్న

- పాదయాత్రతో కోట్ల సంపాదన
- బినామీల పేర భారీగా ఆస్తులు
- కన్సెల్టెన్సీలతో కాసుల వసూళ్లు
- క్యూన్యూస్ మాజీ బ్యూరో చీఫ్ చిలుక ప్రవీణ్ ఆరోపణ
ఖైరతాబాద్, ఆగస్టు 25: తీన్మార్ మల్లన్న డబ్బులకోసం మళ్లీ పాదయాత్ర మొదలు పెడుతున్నాడని క్యూన్యూస్ మాజీ బ్యూరో చీఫ్ చిలుక ప్రవీణ్ ఆరోపించారు. బుధవా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. పేదలు, బహుజన వర్గాలను వాడుకొని తాను లబ్ధి పొందడమే మల్లన్న ఉద్దేశమని చెప్పారు. మల్లన్నను చోటా నయీమ్‌గా అభివర్ణించారు. రోజూ అంగీలాగు సిద్ధాంతం గురించి మాట్లాడే మల్లన్నకు గత పాదయాత్ర నాటికి ఒక స్విఫ్ట్ కారు ఉండేదని.. ఇప్పుడు రెండు ఇన్నోవా లు, మూడు స్విఫ్ట్ కారులు, ఒక బొలేరో, చేతికి 45 వేల రూపాయల వాచీ, భువనగిరి దగ్గర ఐదెకరాల భూమి.. బినామీల పేరిట విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రవీణ్ వెల్లడించారు. క్యూన్యూస్ కూడా నాగరాజుగౌ డ్, పరమేశ్, గడ్డి శ్రవణ్‌కుమార్‌కు చెందిన గోవింద్ క్రియేషన్స్ పేరిట ఉన్నదని తెలిపా రు. విద్య, వైద్యం ఫ్రీగా ఇవ్వాలని బాకా ఊదే మల్లన్న.. క్యాలిబర్ ఎడ్యుకేషన్ ఆఫ్ నెక్ట్స్ జనరేషన్ పేరుతో కన్సల్టెన్సీ పెట్టుకొన్నాడని ఆరోపించారు. చట్టానికి దొరకకుండా చాలా ఆర్గనైజింగ్‌గా క్రైమ్ చేస్తున్నాడని చెప్పారు. మల్లన్నకు నిజాయితీ ఉంటే తనపై తాను సీఐడీ విచారణ జరిపించుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మంత్రులను తిట్టే తీన్మార్ మల్లన్న బీజేపీ శ్రేణులను ఒక్క మాట కూడా అనడని ప్రవీణ్ తెలిపారు. దేశాన్ని తాకట్టు పెట్టిన బీజేపీని ఎందుకు విమర్శిస్తలేడో చెప్పాలని, ఇక్కడే లోపాయికార ఒప్పందమనేది స్పష్టమవుతుందని తెలిపారు. మల్లన్న అవినీతి అక్రమాలను త్వరలోనే సాక్ష్యాధారాలతో వెలుగులోకి తీసుకువస్తామన్నారు. పాదయాత్ర పేరుతో వెంట తిప్పుకొని తన స్వలాభం చూసుకున్న తర్వాత మల్లన్న నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతాడని ఖమ్మం జిల్లా తీన్మార్ మల్లన్న టీం మాజీ సభ్యుడు సంజీవరావు అన్నారు. మల్లన్న టీమ్‌ను అతని కుటుంబానికి సంబంధించిన నలుగురు లీడ్ చేస్తున్నారని, దళిత, గిరిజనులను దూరంగా ఉంచుతాడని ఆరోపించారు. ఈ సమావేశంలో న్యాత అశోక్, మహేశ్, మందకిషన్, ఉదయ్, కళాకారుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న కార్యాల యంలో సోదాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ)/పీర్జాదిగూడ: సీఎం కేసీఆర్‌పై సోషల్‌మీడియా వేదికగా అసత్య ప్రచారాలు, అసభ్య వ్యా ఖ్యలు చేస్తున్న తీన్మార్ మల్లన్నపై సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేశారు. కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం పీర్జాదిగూడలోని క్యూ న్యూ స్ వెబ్ చానల్ కార్యాలయంలో సోదా లు చేసినట్టు సైబర్‌క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఈ సోదాల్లో 40 హార్డ్ డిస్క్‌లు, 2 కంప్యూటర్లు, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- mafia
- q news
- scam
- theenmar mallanna
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

