24 లక్షల ఎకరాల అటవీ భూమి ఏమైంది?
రాష్ట్రంలో దా దాపు 24 లక్షల ఎకరాల అటవీ భూమి లెకల్లో వ్యత్యాసం కనిపిస్తున్నదని, ఆ భూమి ఏమైందో ప్రభుత్వం స్పష్టంచేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.
- బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో దా దాపు 24 లక్షల ఎకరాల అటవీ భూమి లెకల్లో వ్యత్యాసం కనిపిస్తున్నదని, ఆ భూమి ఏమైందో ప్రభుత్వం స్పష్టంచేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, ప్రముఖ నాయకులే భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూముల అక్రమాలకు సంబంధించిన గణాంకాలను వివరించారు.
అధికారిక రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 66,33,313 ఎకరాల అటవీ భూమి ఉండాల్సి ఉండగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కేవలం 42.53 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్నట్లు పేరొన్నారని తెలిపారు. ఈ భారీ వ్యత్యాసంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం అసైన్డ్ భూముల విక్రయానికి సిద్ధమవుతున్నదని, ఇది పేద ప్రజలకు తీరని అన్యాయం చేయడమేనని విమర్శించారు. పేదలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

