మంచిర్యాల జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యతో ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడగా విషయం తెలుసుకున్న ప్రియురాలు సైతం పురుగుల మందు సేవించింది.
ఆదిలాబాద్ : ఆ ప్రేమ జంటకు కులాలు వేరైనప్పటికీ పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురైన ప్రియుడు ఆత్మహత్యకు ఒడిగట్టగా తోడుగా ఉండవలసిన వాడే దూరం అవుతున్నడన్న బాధతో ప్రియురాలు సైతం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో చోటు చేసుకుంది.
మండలంలోని దొనబండ గ్రామపంచాయతీకి చెందిన నాగవెళ్లి శ్రీకాంత్ (24) ఆటో నడుపుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. అదే గ్రామానికి చెందిన నరెడ్ల సంఘవి (21), శ్రీకాంత్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పారు. కులాలు వేరైనప్పటికీ వివాహం జరిపించేందుకు వారు నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఆర్థిక సమస్యలతో అప్పులు పెరగడంతో శ్రీకాంత్ మనస్తాపానికి గురై ఈ నెల 17న సాయంత్రం గుడిపేట ఎల్లంపల్లి ప్రాజెక్టు దారిలోని పోచమ్మ గుడి వద్ద పురుగుల మందు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు సంఘవి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వీరిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా శనివారం సాయంత్రం శ్రీకాంత్, రాత్రి సంఘవి మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

