KTR | రంగరాజన్‌పై దాడి దుర్మార్గమైన చర్య : కేటీఆర్
KTR | తెలంగాణలో పూర్తిగా క్షీణించిన శాంతిభద్రతల పరిస్థితికి.. రంజరాజన్పై ఈ దాడి ఘటన నిలువెత్తు నిదర్శనమంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను ఆయన నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
KTR | తెలంగాణలో పూర్తిగా క్షీణించిన శాంతిభద్రతల పరిస్థితికి.. రంజరాజన్పై ఈ దాడి ఘటన నిలువెత్తు నిదర్శనమంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను ఆయన నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులో రెండు రోజుల కిందట సీఎస్ రంగరాజన్‌పై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు.

దాడి చేసిన వారు ఏ ముసుగులో ఉన్నా, ఏ ఎజెండాతో ఇలాంటి దారుణానికి ఒడిగట్టినా, వారిని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. భగవంతుని సేవలో నిమగ్నమైన రంగరాజన్ కుటుంబ సభ్యులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. చిలుకూరు బాలాజీకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఉన్నారని, స్వామివారి సేవలో నిమగ్నమైన కుటుంబాన్ని అవమానించడం అంటే అది దేవుడినే అవమానించినట్టేనని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

నిందితులందరినీ వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన కేటీఆర్, రంగరాజన్ కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగరాజన్ కుటుంబ సభ్యులకు తాము పూర్తిస్థాయిలో అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వీ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, పార్టీ నాయకులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
MS Dhoni | జెన్-జీకి ఎమ్మెస్ ధోని సూచన.. అలాంటి అలవాట్లతో ఆరోగ్యం పాడవుతుందంటూ ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

