KTR | కేసీఆర్‌కు పేరు వస్తుందనే కిట్లను ఇవ్వడం లేదు : కేటీఆర్
KTR | కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోశంతోనే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని తెలిపారు.
KTR | కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోశంతోనే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని తెలిపారు.
తన పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ కిట్లను ఇస్తానని ప్రకటించిన కేటీఆర్.. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా హైదరాబాద్‌కు చెందిన తల్లీబిడ్డలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్లను అందించారు. గత 20 నెలల నుంచి కేసీఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో చాలా మంది తల్లులు బాధపడుతున్నారని కేటీఆర్ చెప్పారు. అందుకే తన పుట్టిన రోజు సందర్భంగా 5 వేల మంది తల్లులకు సిరిసిల్లలో కేసీఆర్ కిట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు.
2014 కు ముందు నేను రాను బిడ్డో సర్కారు దవఖానాకు అని జనాలు భయపడేవారన్న కేటీఆర్.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న చర్యలతో సర్కార్ దవాఖానాకే పోవాలని జనాలంతా అనుకున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మార్చిన కేసీఆర్ కిట్లను గత 20 నెలల నుంచి రేవంత్ సర్కార్ ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు. కేసీఆర్ మీద ఉన్న అంతులేని ద్వేషం, కోపమే ఇందుకు కారణమని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

