KTR | సిరిసిల్ల నేతన్నలకు అండగా నిలవండి.. డిప్యూటీ సీఎంకు కేటీఆర్ లేఖ
సిరిసిల్లలోని పవర్ లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. పవర్ లూమ్ కార్మికులపై పడుతున్న రూ.35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలను మాఫీ చేసి, వారికి రావాల్సిన రూ.101.77 కోట్ల విద్యుత్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలన్నారు.
హైదరాబాద్: సిరిసిల్లలోని పవర్ లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. పవర్ లూమ్ కార్మికులపై పడుతున్న రూ.35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలను మాఫీ చేసి, వారికి రావాల్సిన రూ.101.77 కోట్ల విద్యుత్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు లేఖ రాశారు.
ఆత్మహత్యలే శరణ్యం
సిరిసిల్ల ప్రాంతం పవర్ లూమ్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిందని, ఇక్కడ సుమారు 25 వేల పవర్ లూమ్‌లు నడుస్తున్నాయని లేఖలో కేటీఆర్ వివరించారు. మారిన మార్కెట్ పరిస్థితులతో బతకలేక ఆత్మహత్యలే శరణ్యం అనుకున్న సిరిసిల్ల నేతన్నల తలరాత మార్చేందుకు తమ హయాంలో బతుకమ్మ చీరల పథకం తీసుకొచ్చామన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్ తో సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని దొరకడంతో పాటు స్థిరమైన ఆదాయం లభించిందని తెలిపారు. అయితే ప్రస్తుతం పవర్ లూమ్ యూనిట్లు ఎదుర్కొంటున్న సమస్యలు కార్మికులను తిరిగి ఆత్మహత్యల వైపు నెడుతున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
హైకోర్టు ఆదేశాలతో పెరిగిన భారం
కుటీర పరిశ్రమల కేటగిరీ కింద 50 శాతం విద్యుత్ టారిఫ్ సబ్సిడీ పొందుతున్న యూనిట్లు, అవగాహన లోపంతో ఎస్ఎస్ఐ (SSI) యూనిట్లుగా మారడంతో ఇండస్ట్రీ-3 కేటగిరీ కిందకు వచ్చాయని కేటీఆర్ వివరించారు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకు 127 ఎస్ఎస్ఐ యూనిట్లకు, అలాగే 191 ఇతర యూనిట్లకు మొత్తం రూ.35.48 కోట్లు బ్యాక్ బిల్లింగ్ బకాయిలు పడ్డాయని తెలిపారు. ఈ భారీ మొత్తాన్ని చెల్లించే స్థితిలో కార్మికులు లేరని, ఫలితంగా వారికి పవర్ లూమ్స్ నడపడం కష్టంగా మారిందన్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో సీఈఎస్ఎస్
పవర్ లూమ్స్‌కు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.101.77 కోట్ల సబ్సిడీ విడుదల కాకపోవడంతో, సిరిసిల్ల కో-ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లయ్ సొసైటీ (CESS) తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని కేటీఆర్ తెలిపారు. టీజీఎన్పీడీసీఎల్కు చెల్లించాల్సిన విద్యుత్ కొనుగోలు ఖర్చులను కూడా చెల్లించలేకపోతున్నదని వివరించారు.
తక్షణ చర్యలు అవసరం
నేత కార్మికులను ఆదుకోవడానికి, వారి జీవనోపాధిని కాపాడటానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కేటీఆర్ కోరారు. బకాయిలను మాఫీ చేసి, సబ్సిడీలను విడుదల చేసి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

