జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
భారత రాజ్యాంగం కంటే గొప్పది ఏదీ లేదని, ఈ దేశంలో ఏ ఒక పౌరుడి ఓటు హకునూ లాకునే అధికారం ఎవరికీ లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. వ్యవస్థల కంటే వ్యక్తులు ఎన్నడూ గొప్పవారు కారని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన బాధ్యతల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు.
- ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?
- రాజ్యాంగం కంటే ఎవరూ ఎకువ కాదు: కేటీఆర్
- ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కాపాడాలి
- బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
- భారీగా ఓట్ల తొలగింపు ప్రజాస్వామ్యానికి అవమానం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : భారత రాజ్యాంగం కంటే గొప్పది ఏదీ లేదని, ఈ దేశంలో ఏ ఒక పౌరుడి ఓటు హకునూ లాకునే అధికారం ఎవరికీ లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. వ్యవస్థల కంటే వ్యక్తులు ఎన్నడూ గొప్పవారు కారని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన బాధ్యతల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ‘ఈ దేశం ఎందరో వ్యక్తులను చూసింది. ఎందరో వచ్చారు.. పోయారు. వాటన్నింటినీ తట్టుకుని భారతదేశం ఎంతో బలంగా నిలబడింది.. సగర్వంగా ముందుకు సాగుతున్నది. అలాంటిది వ్యవస్థలను పకనపెట్టి, ఒక వ్యక్తిని కాపాడటానికి ఇంతటి తాపత్రయం ఎందుకు?’ అని శుక్రవారం ఓ ప్రకటనలో నిలదీశారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రాథమిక హకుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు? అని ప్రశ్నించారు. దేశ మూల సిద్ధాంతాలను, ఆత్మను తుంగలో తొకుతూ సమాంతర వ్యవస్థలను నిర్మించాలని చూసే వారికి కాలం చెల్లిందని హెచ్చరించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో జరిగిన తీవ్ర అక్రమాలు, అవకతవకలపై భారత అత్యున్నత న్యాయస్థానం స్పందించాలని కోరారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి, సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యానికే పెను ముప్పు : హరీశ్
కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రజల్లో ఉన్న విశ్వసనీయతను కాపాడలేకపోతే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా ఉన్న జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి వెన్నెముక.. అధికారంలో ఉన్నవాళ్లకు అది రక్షణ కవచం కాదు’ అని స్పష్టంచేశారు. ఈసీ పనితీరు, స్వతంత్రతపై ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయినప్పుడు ఆ పదవిలో కొనసాగే అర్హత సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ లేదని పేర్కొన్నారు. ఓటర్ల హకులను కాలరాస్తే ఆయన పూర్తి బాధ్యత వహించాలని చెప్పారు. ఈసీ స్వతంత్రత, నియామకాలపై అనుమానాలు రావడం మన రాజ్యాంగ ప్రజాస్వామ్యానికే పెను ముప్పు అని వాపోయారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హకును అర్హులైన పౌరుల నుంచి లాకునే హకు ఎవరికీ లేదని స్పష్టంచేశారు. ఆర్టికల్స్ 324, 325, 326 సహా ప్రజాప్రాతినిధ్య చట్టాల ప్రకారం ఎన్నికల వ్యవస్థ పూర్తిగా నిష్పాక్షికంగా, పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. వ్యక్తులు, ప్రభుత్వాల కంటే ప్రజాస్వామ్యమే అత్యున్నతమైనదని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యానికి అవమానమే : కొప్పుల
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి దాదాపు 95 లక్షల ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా అవమానించడమేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఇది సాధారణ సాంకేతిక సమస్యనో, సవరణో కాదని, పౌరుల ప్రాథమిక రాజ్యాంగ హకులపై జరిగిన ప్రత్యక్ష దాడి అని విమర్శించారు. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3.38 కోట్ల నుంచి 2.43 కోట్లకు తగ్గిందని, ఏకంగా 27.8 శాతం ఓట్ల కోత విధించడం ద్వారా లక్షలాది మంది ఓటర్ల హకులను కాలరాశారని ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఏకంగా 13.31 కోట్ల ఓట్లను తొలగించడం అత్యంత విచారకరమని తెలిపారు. ఎలాంటి పారదర్శకత లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా కోట్ల సంఖ్యలో ఓట్లను తొలగించడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదనే అనుమానాలు వ్యక్తంచేశారు. ఈ భారీ స్థాయిలో ఓట్ల తొలగింపునకు బాధ్యత వహించి సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

