Telangana Bhavan | మేము రెడీ..! తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్, హరీశ్ రావు
Telangana Bhavan | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.
Telangana Bhavan | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్ చెత్తపాలన, అప్పులపై చర్చిందేకు బీఆర్ఎస్ భవన్‌కు వస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పడంతో వారు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. రెండున్నరేండ్లలో రూ.4 లక్షలు అప్పు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ లెక్క తేల్చేందుకు సిద్ధమయ్యారు.
కాగా, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో పాలిటిక్స్ హీటెక్కాయి. కాంగ్రెస్ పార్టీ రెండున్నరేండ్ల చెత్త పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అవినీతి, అక్రమాలపై లెక్కలతో పక్కాగా వివరిస్తాననిస్పష్టం చేశారు. డేట్ అండ్ టైం ప్లేస్ ఏదైనా సరే.. ‘వరంగల్ ప్రెస్క్లబ్లోనా? అశోక్నగర్లోనా? అసెంబ్లీలోనా? వేదిక ఏదైనా బీఆర్ఎస్ తరఫున తాను చర్చకు వస్తా.. రాహుల్‌గాంధీ వస్తారో? ఇంకెవరొస్తారో తేల్చుకోండి. మీ పాలనావైఫల్యాలను లెక్కలతో బయటపెట్టకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటా’నని చాలెంజ్ చేశారు.
కేటీఆర్ సవాల్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally) స్పందించారు. తాను తెలంగాణ భవన్‌కు నేడు(గురువారం) 11 గంటలకు వస్తానని మంత్రి ప్రతి సవాల్ విసిరారు. మంత్రి చాలెంజ్‌ను స్వీకరిచిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో మీ కోసం ప్రత్యేకంగా కుర్చీ రెడీగా ఉంది. మీదే ఆలస్యం దమ్ముంటే చర్చకు రావాలన్నారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అటు తెలంగాణ భవన్, ఇటు గాంధీ భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జూపల్లి వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావు బీఆర్ఎస్ భవన్‌కు వెళ్లేందుకు సిద్దమయ్యారు. జూపల్లి వస్తే కేంద్ర ప్రభుత్వ నివేదికలు, ఆర్బీఐ లెక్కలు, సాక్ష్యాలతో సహా వివరిస్తామని వారు తెలిపారు. కాగా, జూపల్లితో చర్చకు కేటీఆర్ అవసరం లేదని తాను సరిపోతానని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
కావాలంటే కేటీఆర్ కూడా వస్తారన్నారు. ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఎన్ని నెరవేర్చారో చర్చకు బరాబర్ సిద్ధమేనన్నారు. కాంగ్రెస్ అప్పుల బాగోతాన్ని లెక్కలతో తిప్పికొడుతామన్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

