నల్ల బియ్యం.. మళ్లీ పండింది

హైదరాబాద్: నల్ల బియ్యం మళ్లీ పండాయి. వేద వ్యవసాయవేత్త కౌటిల్య కృష్ణన్.. మరోసారి కృష్ణ వ్రీహి బియ్యాన్ని పండించారు. వేదాల ఆధారంగా రెండవ సారి విజయవంతంగా తన పొలంలో నల్ల బియ్యాన్ని పండించినట్లు కౌటిల్య కృష్ణన్ తెలిపారు. కరీంనగర్ జిల్లా ఖాసింపేట గ్రామంలోని తన 3 ఎకరాల పొలంలో కృష్ణ వ్రీహీ (నల్ల బియ్యం) పండించడంలో కౌటిల్య మరోసారి విజయవంతమయ్యారు. తెలంగాణ ప్రాంతంలో రైతులు అనాదిగా అనుసరించే మండి కట్టే పద్ధతితో పాటు వేద వ్యవసాయ పద్ధతులు ఫాలో అయినట్లు ఆయన చెప్పారు.
డిసెంబర్ మాసంలో విత్తనం వేశామని, ఇప్పుడు వంద శాతం పంట వచ్చిందని కౌటిల్య తెలిపారు. వేద వ్యవసాయంలో భాగంగా పాలు, తేనెతో పాటు అగ్నిహోత్ర భస్మం కూడా వాడినట్లు చెప్పారు. అధిక దిగుబడి కోసం ఆవుపేడను ఎరువుగా వాడినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో వేద వ్యవసాయం ద్వారా వంద శాతం పంట పండిందని చెప్పారు. చుట్టుపక్కల రైతులు కూడా కౌటిల్య పొలాన్ని సందర్శించి ప్రశంసలు కురిపిస్తున్నారు. మరో రెండు రోజుల్లో కరీంనగర్ కలెక్టర్ శశాంక్ కూడా కౌటిల్యుడి పొలాన్ని సందర్శించనున్నారు.
దేశీయ విత్తనాల వల్ల పలు ప్రయోజనాలున్నాయి. నాటు విత్తనాలు వాడటం ద్వారా పురుగులు వచ్చే శాతం తక్కువ. రుచి బాగుంటుంది. విత్తనాలు వంద శాతం మొలకెత్తే అవకాశం ఉంటుంది. భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కూడా ఉంటుంది. నీళ్లు ఎక్కువగా అవసరం ఉండదు. ఎలాంటి భూమిలోనైనా పంట బ్రహ్మాండంగా పండుతుంది. పంట దిగుబడి బాగా వస్తుంది. రైతన్నలు నాటు విత్తనాలు నిల్వ చేసుకుని తదుపరి పంటకు మళ్లీ వేసుకోవచ్చు. దేశీయ విత్తనాల్లో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. దేశీయ విత్తనాలు వాడటం వల్ల ఆర్ధికంగా కూడా రైతులు లాభపడతారు. దేశీయ విత్తనాల వల్ల అన్నదాతలు ఆర్ధికంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

