వరంగల్ : బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 9, 10వ తేదీలలో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ నేడు మొదటి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చెసింది. కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు దంత కళాశాలలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు . కళాశాల వారీగా సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్లో పొందుపరిచారు. ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.knruhs.telangana.gov.inలో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.