బండి సంజయ్‌పై కేసు నమోదు.. కాసేపట్లో కోర్టుకు..
Bandi Sanjay | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 317 జీవో పేరుతో ఆదివారం రాత్రి కరీంనగర్లో జాగరణ పేరుతో దీక్ష చేపట్టారు. అయితే కొవిడ్ నిబంధనలు అతిక్రమించి దీక్ష చేపట్టరాదని పోలీసులు నోటీసు జారీ చేసినా వినలేదు.

కరీంనగర్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 317 జీవో పేరుతో ఆదివారం రాత్రి కరీంనగర్లో జాగరణ పేరుతో దీక్ష చేపట్టారు. అయితే కొవిడ్ నిబంధనలు అతిక్రమించి దీక్ష చేపట్టరాదని పోలీసులు నోటీసు జారీ చేసినా వినలేదు. దీంతో మూడు గంటల హైడ్రామా తర్వాత బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ పోలీసు ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారు.
ఈ సందర్భంగా కరీంనగర్ సీపీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా దీక్ష చేపట్టిన బండి సంజయ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాసేపట్లో బండి సంజయ్‌ను కోర్టుకు తరలిస్తామని చెప్పారు. బండి సంజయ్ తన దీక్షలో కొవిడ్ నిబంధనలు పాటించలేదు. మాస్కులు ధరించని 25 మందిపై కేసు నమోదు చేశామన్నారు. పొలీసులపై కొంతమంది యువకులు దాడులకు పాల్పడి విధులకు ఆటంకం కలిగించారు. ఈ క్రమంలో 16 మందిపై విపత్తు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం. 60 మందిని విడుదల చేసి నోటీసులు ఇచ్చాం. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా సభలు, సమావేశాలకు అనుమతి లేదు అని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

