అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
పంట దిగుబడి రాక.. సాగుకు పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
- పంట దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక మనస్తాపం
- కరీంనగర్ జిల్లాలో విషాదం
జమ్మికుంట, అక్టోబర్ 30 : పంట దిగుబడి రాక.. సాగుకు పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాపక్కపల్లికి చెందిన పుట్టకొక్కుల రాజయ్య(62)కు రెండెకరాల భూమి ఉన్నది. మరో ఐదెకరాల వరకు కౌలు కు తీసుకుని వరి, పత్తి పంట సాగు చేశాడు.
పెట్టుబడుల కోసం రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. ఇటీవల పంట దిగుబడి సరిగా రాలేదు. పెట్టుబడి ఎక్కువైంది. చేసిన అప్పులు పెరిగిపోయాయి. అప్పులు తీర్చే మార్గం కానరాక తీవ్ర మనస్తాపం చెందాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజయ్యకు భార్య రాధ, కూతురు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

