ఆపరేషన్ చేయించి.. నిండు ప్రాణం నిలిపి
- ఎమ్మెల్సీ కవిత చొరవతో గర్భిణికి శస్త్రచికిత్స
- పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జ్యోతిబాయి

హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవతో ఓ తల్లి ప్రసవ వేదన తీరింది. ఏ ఆటంకం లేకుండా ఓ పసిప్రాణం ఈ లోకంలోకి అడుగుపెట్టింది. కోస్గికి చెందిన జ్యోతిబాయి 9 నెలల గర్భిణి. డెలివరీ సమయం కన్నా ముందే నొప్పులు వచ్చాయి. రక్తం తక్కువగా ఉండటంతో తక్షణం ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. క్యాబ్ డ్రైవర్ అయిన జ్యోతిబాయి భర్తకు ఆ ఆపరేషన్ చేయించటం ఆర్థికంగా భారంగా మా రింది. ఆమె మరిది ట్విట్టర్ ద్వారా సహాయం కోసం అభ్యర్థించగా కొందరు స్పందించారు. వచ్చిన మొత్తం ఆపరేషన్‌కు సరిపోదు. మరోవైపు జ్యోతిబాయి పరిస్థితి క్రిటికల్‌గా మారడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత.. ఆపరేషన్ ఖర్చును భరిస్తానని ముందుకొచ్చారు. కవిత చొరవతో జ్యోతిబాయికి క్లిష్టమైన ఆపరేషన్ సోమవారం పూర్తయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. దీనిపై కవిత ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వెలిబుచ్చారు. కవితక్క చేసిన సహాయానికి జ్యోతిబాయితోపాటు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. క్యాబ్ డ్రైవర్ అయిన తాను ఇక నుంచి గర్భిణులను ఉచితంగా హాస్పిటల్‌కు తరలిస్తానని జ్యోతిబాయి భర్త తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- baby
- Pregnant girl
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

