TS Highcourt | హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు
TS Highcourt | తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు నియామకం అయ్యారు. అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావుకు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు నియామకం అయ్యారు. అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావుకు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.
జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు హైదరాబాద్ వ్యక్తే
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. 1966, ఆగస్టు 7న హైదరాబాద్‌లో జన్మించారు. నగరంలోని సెయింట్ పాల్స్ హైస్కూల్లో పదో తరగతి వరకు చదివారు. ఇంటర్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో, బీఎస్సీ భవన్స్ న్యూ సైన్స్ కాలేజీలో పూర్తి చేశారు. 1989లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పుచ్చుకున్నారు. ఎల్ఎల్బీ తృతీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించినందుకు సీవీఎస్ఎస్ ఆచార్యులు గోల్డ్ మెడల్‌ను రామచంద్రరావు అందుకున్నారు. 1989, సెప్టెంబర్ నెలలో అడ్వకేట్‌గా తన పేరును నమోదు చేసుకున్నారు. 1991లో యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా సాధించారు.
సీజే జస్టిస్ హిమా కోహ్లీకి వీడ్కోలు
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన నేపథ్యంలో హైకోర్టు జడ్జిలు శుక్రవారం ఆమెకు వీడ్కోలు పలికారు. వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ హైకోర్టు మొట్టమొదటి మహిళా చీఫ్ జస్టిస్‌గా హిమా కోహ్లీ ఈ ఏడాది జనవరి 7న నియమితులైనారు. సెప్టెంబర్ 1న పదవీ విరమణ చేయనున్న సందర్భంలోనే ఆమెకు సుప్రీం జడ్జిగా పదోన్నతి లభించడం విశేషం. దీంతో మరో మూడేళ్ల పాటు హిమా కోహ్లీ జడ్జిగా పనిచేసే అవకాశం లభించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

