పాఠాలు బంద్‌పెట్టి.. ఆచార్యుల ర్యాలీ.. వీసీకి మద్దతుగా జేఎన్టీయూలో ర్యాలీ
జేఎన్టీయూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది. ఒక వివాదం ముగియకముందే.. మరో వివాదం వర్సిటీని చుట్టుముడుతున్నది. తాజాగా ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన మహిళా ప్రొఫెసర్లను వీసీ దూషించినట్టు ఆరోపణలు రావడంతో వర్సిటీ మరోసారి వివాదాలకు కేంద్రబిందువయ్యింది. వీసీకి మద్దతుగా శుక్రవారం యూనివర్సిటీ ఫ్యాకల్టీ, బోధనేతర సిబ్బంది వర్సిటీలో ర్యాలీ నిర్వహించారు.
- ఇది రెండోసారి.. మండిపడుతున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది. ఒక వివాదం ముగియకముందే.. మరో వివాదం వర్సిటీని చుట్టుముడుతున్నది. తాజాగా ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన మహిళా ప్రొఫెసర్లను వీసీ దూషించినట్టు ఆరోపణలు రావడంతో వర్సిటీ మరోసారి వివాదాలకు కేంద్రబిందువయ్యింది. వీసీకి మద్దతుగా శుక్రవారం యూనివర్సిటీ ఫ్యాకల్టీ, బోధనేతర సిబ్బంది వర్సిటీలో ర్యాలీ నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి పరిపాలన భవనం వరకు ప్రదర్శన నిర్వహించారు. వీసీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు. డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, ఆచార్యులు, బోధన, బోధనేతర సిబ్బంది అంతా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కొంతకాలం క్రితం రిజిస్ట్రార్ మార్పు అంశం రచ్చకు దారితీసింది. అప్పట్లో బోధన, బోధనేతర సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
అయితే పాఠాలు బంద్ పెట్టి ఆచార్యులు ర్యాలీ తీయడంపై విద్యార్థి సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. విద్యార్థి సమస్యలపై విద్యార్థి సంఘాలు ధర్నాలు చేయాల్సింది పోయి..యూనివర్సిటీ ఫ్యాకల్టీ, బోధనేతర సిబ్బంది ర్యాలీలు చేయడం వింతగా ఉన్నదని అంటున్నారు. ఒక వేళ వీసీ దూషించకపోతే, ఆయనపై ఆరోపణలు అవాస్తవమైతే.. సీసీ కెమెరా ఫుటేజీలను ఎందుకు బయటపెట్టడంలేదని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. దళిత ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలని, బాధితుల పక్షాన ఉండాల్సిందిపోయి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి పక్షాన ఉండటం బాధాకరమని అంటున్నారు. వ్యక్తులను కాపాడేందుకు యూనివర్సిటీ వ్యవస్థను ఉపయోగించుకోవడం పట్ల విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పందించి బాధితులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని యూనివర్సిటీని చక్కదిద్దాలని కోరుతున్నారు.
ఏదో ఒక వివాదం.. ఆరోపణలు
- కొంతకాలం క్రితం ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో తనిఖీలకు వెళుతున్నవారు మామూళ్లకోసం డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయని విలేకరులు యూనివర్సిటీ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వంలోని కొందరు బిల్లుల వసూళ్లకు 20-30 పర్సంటేజీలు పుచ్చుకుంటున్నారు, దీనికేమంటారంటూ విలేకరులనే దబాయించారు.
- యూనివర్సిటీ వీసీ ఫోన్ ఎవరో అజ్ఞాతవ్యక్తి ఎత్తుతున్నారని, అన్నింటిని ఆయన సమాధానాలిస్తున్నారని ఆరోపణలున్నాయి.
- 2015లో ఓ దళిత విద్యార్థిని కులం పేరుతో దూషించడం తీవ్ర దుమారం రేపింది. విద్యార్థి సంఘాల నేతలు చాంబర్‌ను ధ్వంసం చేశారు. రెక్టార్ పదవి నుంచి తొలగించారు కూడా.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

