యువతకు జయశంకర్ సార్ మార్గం అనుసరణీయం : మంత్రి గంగుల
జయశంకర్ సార్ మార్గం అనుసరణీయం | ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిషలు కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా యువత నడవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

కరీంనగర్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిషలు కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా యువత నడవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా శుక్రవారం నగరంలోని మదీనా చౌరస్తా వద్ద గల జయశంకర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ సార్ అని కొనియాడారు. జయశంకర్ ఆలోచనలు, ఆశయాల కనుగుణంగా అన్ని వర్గాల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ .వి. కర్ణన్, శాసనమండలి సభ్యుడు నారదాసు లక్ష్మణరావు, నగర మేయర్ వై. సునీల్ రావు ,మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Tokyo Olympics: మెడల్‌పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్‌కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

