ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా
- బండి సంజయ్‌కి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సవాల్

జనగామ, మే 4 (నమస్తే తెలంగాణ) : తనపై భూ కబ్జా ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే జనగామకు చర్చకు రావాలని.. తాను గుంట భూమి ఆక్రమించినట్టు లేదా అసైన్డ్, ప్రభుత్వ భూమి ఉన్నట్టు ఆధారాలు చూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మంగళవారం జనగామలో జరిగిన ముస్లింలకు రంజాన్ గిఫ్ట్‌ల పంపిణీ కార్యక్రమంలో ముత్తిరెడ్డి మాట్లాడారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా గాలి మాటలు చెప్పడం హేయమన్నారు. ఆరోపణలు రుజువు చేస్తే జనగామ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కునేలకు రాసి రాజీనామా పత్రాన్ని సీఎం కేసీఆర్ చేతిలో పెడుతా.. ఈ సవాల్‌ను స్వీకరిస్తావా? అంటూ బండిపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఆశీర్వదించి టికెట్ ఇస్త్తే.. రెండుసార్లు జనగామ ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకున్నారని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

