మంత్రి ఉత్తమ్ కాన్వాయ్ అడ్డగింత
తమకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టెయిల్‌పాండ్ నిర్వాసితులు, గ్రామస్థులు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్‌ని ఆదివారం అడ్డుకున్నారు.
అడవిదేవులపల్లి, ఆగస్టు 11 : తమకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టెయిల్‌పాండ్ నిర్వాసితులు, గ్రామస్థులు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్‌ని ఆదివారం అడ్డుకున్నారు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న దున్నపోతుల గండి లిఫ్ట్ పనులను పరిశీలించడానికి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌పాటి, ఎన్నెస్పీ చీఫ్ ఇంజినీర్ అనిల్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కాన్వాయ్‌ని వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వారిని తప్పించే ప్రయత్నం చేయగా కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నది. తమకు తాగునీరు రావడం లేదని, ఇండ్లల్లోకి పాములు, తేళ్లు వస్తున్నాయని నిర్వాసితులు ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని మంత్రిని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

