హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎడ్యుకేషనల్ టూల్ – వర్చువల్ ఇంటెలిజెంట్ సిస్టమ్ ఫర్ టైలర్డ్ అకడమిక్స్(విస్టా-VISTA)ను గురువారం ఆవిష్కరించినట్టు శ్రీ చైతన్య విద్యా సంస్థల ఎడ్టెక్ విభాగం ఇన్ఫినిటీ లెర్న్ ఒక ప్రకటనలో తెలిపింది. చదువుకు రక్షణ కవచంగా ఉండే భావనను రీ-డిజైన్ చేయడమే విస్టా లక్ష్యమని వెల్లడించింది.
ఈ టూల్ విస్తృత స్థాయిలో అనేక ప్రశ్నలను అర్థం చేసుకొని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుందని ఇన్ఫినిటీ లెర్న్ తెలిపింది. విద్యార్థుల సందేహాలను తీర్చడమే కాకుండా వారు వివిధ సబ్జెక్టులను లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ టూల్ సాయం చేస్తుందని వివరించింది. పాఠ్య ప్రణాళికలను అంశాలవారీగా రూపొందించడంలో ఈ టూల్ ఉపాధ్యాయులకు కూడా ఉపయోగపడుతుందని తెలిపింది.